17 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించిన ఓ బేబీ


Oh Baby 3 Days Collections
Oh Baby 3 Days Collections

సమంత నటించిన ఓ బేబీ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే 17 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది . దాంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది . నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఓ బేబీ చిత్రంలో సమంత , లక్ష్మీ , రాజేంద్రప్రసాద్ , నాగశౌర్య , జగపతిబాబు , తేజ , రావు రమేష్ , ప్రగతి, అడవి శేష్  తదితరులు నటించారు . జూలై 5 న విడుదలైన ఈ చిత్రానికి హిట్ టాక్ రావడంతో కలెక్షన్లు పెరుగుతున్నాయి .

మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్ల గ్రాస్ వసూళ్ల ని 9 కోట్ల షేర్ ని సాధించింది . కొరియన్ సినిమా అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఉండటంతో బ్రహ్మరథం పడుతున్నారు . సమంత నటనకు ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు . మూడు రోజుల్లోనే 17 కోట్ల వసూళ్లు రావడంతో ప్రేక్షకులను కలవడానికి బయలుదేరింది ఓ బేబీ చిత్ర బృందం . ఇక ఓవర్ సీస్ లో హాఫ్ మిలియన్ దాటేసి వన్ మిలియన్ వైపు పరుగులు తీస్తోంది .