సమంత కు వెటకారం ఎక్కువే !సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ” ఓ బేబీ ” కొరియన్ సినిమా ” మిస్ గ్రానీ ” కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఓ బేబీ చిత్రంలోని టైటిల్ సాంగ్ ని నిన్న సాయంత్రం విడుదల చేసారు . ఈ టైటిల్ సాంగ్ చూస్తుంటే సమంత కు ఎంత వెటకారం ఉందో ఇట్టే అర్ధమైపోతుంది . తన క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో ఈ పాట ద్వారా చెప్పే ప్రయత్నం చేసారు దర్శకురాలు నందిని రెడ్డి .

నందిని రెడ్డి దాదాపు రెండేళ్ల తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఓ బేబీ . నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ప్రతీ చిత్రం రీమేక్ లేదంటే ఫ్రీమేక్ అయి ఉంటుంది తప్ప స్ట్రైట్ చిత్రం ఇంతవరకు చేయలేదు . ఇక ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా కూడా కొరియన్ రీమేక్ కావడం విశేషం . మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో నాగశౌర్య , రావు రమేష్ , లక్ష్మి తదితరులు నటించారు . వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంత ఓ బేబీ తో ఆ ఫీట్ ని కంటిన్యూ చేస్తుందా చూడాలి .