టెర్రాస్‌పై సామ్ ఏం చేస్తోంది?


టెర్రాస్‌పై సామ్ ఏం చేస్తోంది?
టెర్రాస్‌పై సామ్ ఏం చేస్తోంది?

క‌రోనా, లాక్‌డౌన్ కార‌ణంగా జ‌న‌జీవితం స్థంభించిపోయింది. సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంతా ఇంటికే ప‌రిమితం అయిపోయారు. ఇంట్లో వుంటూనే ప్ర‌యోగాలు చేస్తున్నారు. కొంత మంది టెక్నాల‌జీని ఉప‌యోగించి షార్ట్ ఫిల్మ్స్ నిర్మిస్తుంటే వ‌ర్మ లాంటి వాళ్లు ఏకంగా సినిమాలే నిర్మించేస్తూ షాకిస్తున్నారు. ఇదిలా వుంటే అక్కినేని వారి ఇంటి కోడ‌లు, స్టార్ హీరోయిన్ స‌మంత మాత్రం కొత్తగా అధునికి వ్య‌వ‌సాయం చేస్తోంది.

అదీ టెర్రాస్‌పై. లాక్‌డౌన్ మొద‌లైనప్పుడు సోష‌ల్ మీడియాకు దూర‌మైన స‌మంత మ‌ళ్లీ రీసెంట్‌గా యాక్టివ్‌గా మారింది. నిత్యం పోస్ట్‌లు పెడుతూ ఫ్యాన్స్‌కి ట‌చ్‌లో వుంటోంది. ఇటీవ‌ల పూజా హెగ్డే వివాదంపై స్పార్ట్‌గా వ్య‌వ‌హ‌రించి అభిమానుల మ‌న‌సు గెల్చుకున్న సామ్ ప్ర‌స్తుతం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తోంది. త‌న ఇంటి టెర్రాస్‌పై న‌వీన ప‌ద్ద‌తిలో వెజిటెబుల్స్ పెంచేస్తోంది.

అర్బ‌న్ కిసాన్ వారితో క‌లిసి త‌న ఇంటి టెర్రాస్‌పై కూర‌గాయ‌లు పండిస్తోంది. ఆర్గానిక్ వ్య‌వ‌సాయాన్ని సామ్ చేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోల‌ని ఇన్ స్టా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది. ప్ర‌స్తుతం ఇవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. స‌మంత ప్ర‌స్తుతం `ఫ్యామిలీమ్యాన్ సిరీస్ 2`లో న‌టిస్తోంది.