స‌మంత స‌రికొత్త ప్ర‌యోగం చేస్తోందా?


Samantha playing negetiv role in family man season 2
Samantha playing negetiv role in family man season 2
Samantha playing negetiv role in family man season 2
Samantha playing negetiv role in family man season 2

తెలుగు, త‌మిళ భాష‌ల్లో స‌మంత‌కున్న క్రేజ్ అంద‌రికి తెలిసిందే. క‌మ‌ర్షియ‌ల్ క‌థానాయిక‌గా భారీగానే డిమాండ్ చేస్తున్న సామ్ పెళ్లి త‌రువాత త‌న పంథాను మార్చి కొత్త తర‌హా పాత్ర‌ల్లో మాత్ర‌మే న‌టిస్తోంది. విభిన్న‌మైన కథ‌ల్ని ఎంచుకుంటూ వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకుంటోంది. `రాజు గారిగ‌ది 2` నుంచి కొత్త త‌ర‌హా పాత్ర‌ల్ని ఎంచుకుంటోంది. దాంతో ద‌ర్శ‌కులు కూడా స‌మంత కోసం కొత్త త‌ర‌హా పాత్ర‌ల్ని సృష్టిస్తున్నారు. అలా  స‌మంత  కోసం వ‌చ్చిన చిత్రాలే `రంగ‌స్థ‌లం`లోని రామ‌ల‌క్ష్మి, మ‌హాన‌టి లోని మ‌ధుర‌వాణి, యూట‌ర్న్‌లోని ర‌చ‌న, ఓ బేబీ చిత్రంలోని బేబీ పాత్ర‌.

ఇలా విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తున్న స‌మంత తాజాగా కొత్త త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. వ‌రుస సినిమాల‌తో బిజీగా వున్న స‌మంత తాజాగా వెబ్ సిరీస్‌లో న‌టించ‌డానికి అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల వెర్స‌టైల్ యాక్ట‌ర్ మ‌నోజ్ బాజ్ కీల‌క పాత్ర‌లో న‌టించిన వెబ్ సిరీస్ `ఫ్యామిలీ మ్యాన్‌`. రాజ్ ఎన్ డీకే ద‌ర్శ‌క‌ద్వ‌యం రూపొందించిన ఈ వెబ్ సిరీస్ స‌క్సెస్‌తో పాటు మేకింగ్ విష‌యంలో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకుంది. తొలి సిరీస్ ఇచ్చిన స‌క్సెస్ జోష్‌లో వున్న రాజ్ ఎన్ డీకే దీనికి కొన‌సాగింపుగా `ఫ్యామిలీ మ్యాన్‌-2` రూపొందిస్తున్నారు.

ఈ సిరీస్‌పై క్రేజ్ ఏర్ప‌గింది. ఆ క్రేజ్‌కి ఏ మాత్రం త‌గ్గ‌ని స్థాయిలో న‌టీన‌టులు వుండాల‌ని భావించిన రాజ్ ఎన్ డీకే క్రేజీ హీరోయిన్ స‌మంత‌ని కీల‌క పాత్ర కోసం ఖ‌రారు చేసుకున్నారు. ఇటీవ‌లే ఈ సిరీస్ షూటింగ్ మొద‌లైంది. ఇందులో స‌మంత రెగ్యుల‌ర్ పాత్ర‌కు పూర్తి భిన్నంగా నెగెటివ్ పాత్ర‌లో క‌నిపించనుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ సిరీస్‌తో స‌మంత ప్ర‌యోగం ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.