రాజమౌళి కి షాక్ ఇచ్చిన సమంత


samantha rejected ss rajamouli offer

ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తన తదుపరి సినిమాలో నటించమని సమంత ని అడిగితే నటించనని చెప్పి షాక్ ఇచ్చిందట సమంత . ఇప్పుడు ఈ వార్త ఫిలిం నగర్ సర్కిల్లో సంచలనం సృష్టిస్తోంది . సమంత – రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఈగ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే . పైగా రాజమౌళి సినిమాలో ఛాన్స్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు ఎందుకంటే ఓటమి ఎరుగని దర్శక ధీరుడు కాబట్టి . ఈయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలన్నీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే .

తాజాగా ఈ దర్శకుడు ఎన్టీఆర్ – చరణ్ లతో భారీ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టాడు . ఆ చిత్రంలో హీరోయిన్ లుగా కీర్తి సురేష్ , పూజా హెగ్డే లను తీసుకోనున్నట్లు తెలుస్తోంది అలాగే ఓ కీలక పాత్రలో సమంత ని తీసుకుంటే బాగుంటుందని భావించాడట !అయితే జక్కన్న ఆఫర్ ని నిర్మొహమాటంగా తిరస్కరించినట్లు ఊహాగానాలు వస్తున్నాయి . ఐతే ఇది నిజమా ? కాదా ? అన్నది తెలియాల్సి ఉంది . ఇక సమంత విషయానికి వస్తే పెళ్లి తర్వాత భారీ హిట్ లు కొడుతోంది ఈ భామ . తాజాగా నాగచైతన్య తో కలిసి ఓ చిత్రంలో నటించడానికి సమాయత్తం అవుతోంది సమంత .

English Title: samantha rejected ss rajamouli offer