టాట్టూ సీక్రెట్ బయటపెట్టిన సమంత


Samantha
Samantha

అందాల భామ సమంత ఇన్నాళ్ళుగా దాచుకున్న టాట్టూ సీక్రెట్ ని ఎట్టకేలకు రివీల్ చేసింది . ఇంతకీ సమంత టాట్టూ ఎక్కడ వేయించుకుందో తెలుసా ……. ఎద కింది భాగంలో ఈ టాట్టూ వేయించుకుంది , ఇంతకీ ఆ టాట్టూ ఏంటో తెలుసా …… అక్కినేని నాగచైతన్య టాట్టూ అట అది . ఇన్నాళ్లు దాచుకున్న టాట్టూ విషయం చెప్పేస్తున్నా, నా భర్తే నా ప్రపంచం అంటూ అసలు విషయాన్నీ బయటపెట్టేసింది సమంత .

అంతేకాదు టాట్టూ కి సంబందించిన ఫోటో ని కూడా ట్వీట్ చేసింది సమంత . ఇటీవలే సమంత నటించిన ఓ బేబీ చిత్రం విడుదల కాగా ఆ సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది . ఇక నాగచైతన్య – సమంత ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . సమంత చేసిన ట్వీట్ , ఫోటో వైరల్ అవుతున్నాయి .