బ‌న్నీకి స‌మంత వెరైటీగా వెల్క‌మ్‌!


బ‌న్నీకి స‌మంత వెరైటీగా వెల్క‌మ్‌!
బ‌న్నీకి స‌మంత వెరైటీగా వెల్క‌మ్‌!

బ‌న్నీకి స‌మంత వెరైటీగా వెల్క‌మ్ చెప్పింది. వైన్ బాటిల్ .. స‌రికొత్త మొబైల్ ఫోన్‌ని గిఫ్ట్‌గా అందిస్తూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు స్వాగ‌తం ప‌ల‌క‌డం ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే… డిజిట‌ల్ స్ట్రీమింగ్ ఓటీటీ యాప్‌ `ఆహా`. ది గ్రేట్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ మైహోమ్ గ్రూప్‌తో క‌లిసి స్టార్ట్ చేసిన ఈ డిజిట‌ల్ మాధ్య‌మం లాక్‌‌డౌన్ నుంచి వెలుగులోకి వ‌చ్చిన ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

దీన్ని మ‌రింత పాపుల‌ర్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో భాగంగా స్టార్ హీరోయిన్ స‌మంత హోస్ట్‌గా `సామ్ జామ్` పేరుతో ఓ టాక్ షోని ప్రారంభించారు. ఇందులో సెల‌బ్రిటీల క్రేజీ ఇంట‌ర్వ్యూల‌తో పాటు స‌హాయం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదే వేదిక ద్వారా స‌హాయాన్ని అందిస్తున్నారు. త్వ‌ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మొద‌లైన ఈ టాక్ షో ఆహాలో ట్రెండ్ అవుతోంది.

తాజాగా ఈ టాక్ షో కోసం బ‌న్నీ కూడా హాజ‌ర‌య్యారు. దీనికి సంబంధించిన షూటింగ్ ఇటీవ‌ల అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతున్న బ‌న్నీకి స‌మంత వెరైటీగా స్వాగ‌తం ప‌ల‌క‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. బ‌న్నీకి వైన్ బాటిల్‌, కాస్ట్‌లీ మొబైల్‌ని కానుక‌గా అందిస్తూ సామ్ స్వాగ‌తం ప‌లికిన తీరు వైర‌ల్ అవుతోంది. ఈ షోలో బ‌న్నీ ని సామ్ ఏ స్థాయిలో ఆట‌ప‌ట్టిస్తుందో తెలియాలంటే క్రిస్మ‌స్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.