బిగ్ బాస్ 4: సమంత స్పెషల్ చీర ఖరీదు ఎంతంటే?

బిగ్ బాస్ 4: సమంత స్పెషల్ చీర ఖరీదు ఎంతంటే?
బిగ్ బాస్ 4: సమంత స్పెషల్ చీర ఖరీదు ఎంతంటే?

సమంత అక్కినేని వివిధ రంగాలలో దూసుకుపోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే హీరోయిన్ గా తన హవా చాటుతున్న సమంత, వెబ్ సిరీస్ లలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇప్పుడు హోస్ట్ గా కూడా మారింది. ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో సామ్ జామ్ పేరిట నిర్వహించే సెలబ్రిటీ టాక్ షో కు హోస్ట్ గా ఆమె వ్యవహరించనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసారు.

అంతే కాకుండా రెండు వారాల క్రితం బిగ్ బాస్ 4 కు హోస్ట్ గా సమంత వ్యవహరించింది. ఈ దసరా స్పెషల్ వీడియోకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. 11.3 రేటింగ్స్ తో ఆడియెన్స్ కూడా ఈ ఎపిసోడ్ కు బ్రహ్మరథం పట్టిన విషయం అర్ధమవుతోంది.

ముఖ్యంగా సమంత షో ను హ్యాండిల్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఆమె కట్టుకున్న స్పెషల్ చీర, జ్యువలరీ విషయంలో క్లారిటీ వచ్చింది. ఆమె తన డ్రెసింగ్ తో కూడా ఆకట్టుకుంది. సమంత చీర దాదాపు 25 లక్షల రూపాయలు ఉంటుందని ఆమె డిజైనర్ మనోజ్ఞ తెలిపారు. ఇక నగలు కూడా నిజమైనవి వాడారు. దాదాపు 25 లక్షల రూపాయల నగదును ఉపయోగించారు.