కుర్ర డైరెక్టర్ కు ఐ లవ్ యు చెప్పిన సమంత

Samantha says i love you pawan kumarకుర్ర డైరెక్టర్ కు ఐ లవ్ యు అంటూ చెప్పి షాక్ ఇచ్చింది సమంత . ఇంతకీ సమంత ఐ లవ్ యు అంటూ చెప్పింది ఎవరికో తెలుసా …… యు టర్న్ డైరెక్టర్ పవన్ కుమార్ కు . సమంత కీలక పాత్ర పోషించిన చిత్రం యు టర్న్ . ఆ సినిమా సమంతకు మంచి పేరు తీసుకువచ్చింది దాంతో ఆ సినిమా అంటే ఇష్టం అలాగే ఆ సినిమాకు దర్శకత్వం వహించిన పవన్ కుమార్ అంటే మరింత ఇష్టమని అంటోంది . పవన్ కుమార్ వర్కింగ్ స్టైల్ సమంతకు నచ్చడంతో అతడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐ లవ్ యు మై ఫ్రెండ్ అని ట్వీట్ చేసింది ఇంకేముంది ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది .

సమంత నాగచైతన్య ని ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే . అయితే కుర్ర డైరెక్టర్ కు విషేష్ చెప్పడం వైరల్ గా మారింది . పైగా కొంతమంది నెటిజన్ లు సమంత ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు . సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే సమంతతో నెటిజన్ లకు ఎప్పుడూ వివాదమే ! ఎందుకంటే ఆమె ఎప్పుడు తప్పు చేస్తుందా ? అని వెతికే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు దాంతో సమంత ట్వీట్స్ వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి . తాజాగా ఈ ట్వీట్ వివాదం అయ్యేలా ఉంది .

English Title: Samantha says i love you pawan kumar