స‌మంత‌పై ఆ వార్త నిజం కాదా?

స‌మంత‌పై ఆ వార్త నిజం కాదా?
స‌మంత‌పై ఆ వార్త నిజం కాదా?

పెళ్లి త‌రువాత నుంచి న‌ట‌న‌కు ఆస్కార‌మున్న పాత్ర‌ల్లోనే న‌టిస్తోంది స‌మంత‌. ఆ త‌ర‌హా క‌థ‌ల‌కే అధిక ప్రాధాన్య‌త‌నిస్తోంది కూడా. ఆమె న‌టించిన మ‌హిళా ప్ర‌ధాన చిత్రాలు యూట‌ర్న్‌, ఓ బేబీ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వసూళ్ల‌ని రాబ‌ట్టడంతో పాటు మంచి విజ‌యాల్ని కూడా ద‌క్కించుకోవ‌డంతో సామ్ ఈ త‌ర‌హా చిత్రాల‌కే ప్రాధాన్య‌త‌నిస్తోంది. అయితే ఇటీవ‌ల ఆమె న‌టించిన `జాను` ఊహించ‌ని రీతిలో ప‌రాజ‌యం చెంద‌డంతో కొంత నిరుత్సాహానికి గురైంద‌ట‌.

ఇదిలా వుంటే సామ్ ప్రెంగ్నెంట్ అని, అక్కినేని ఫ్యామిలీలోకి స‌మంత ద్వారా మ‌రో మెంబ‌ర్ రాబోతున్నారంటూ ఇటీవ‌ల వ‌రుస క‌థ‌నాలు వినిపించాయి. అయితే ఆ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని సామ్ హెవీ వెయిట్‌ని లిఫ్ట్ చేసిన‌ప్పుడే అర్థ‌మైంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశ‌కు గుర‌య్యార‌ట‌. సామ్ ఏంటీ ఇలా షాకిస్తోంద‌ని ఫీల‌వుతున్నార‌ట‌. ఇటీవ‌ల న‌య‌న‌తార‌తో క‌లిసి ఓ త‌మిళ చిత్రాన్ని చేయాల‌నుకుంద‌ని, ప్రెగ్నెంట్‌కార‌ణంగానే త‌ను ఆ సినిమా నుంచి త‌ప్పుకుంద‌ని ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపించాయి.

అయితే సామ్ ఆ సినిమా స్థానంలో మ‌రో మ‌హిళా ప్ర‌ధాన చిత్రాన్ని అంగీక‌రించిన‌ట్టు తెలిసింది. అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్‌తో ఓ సినిమాని చేయ‌బోతోంది. తాప్సీతో `గేమ్ ఓవ‌ర్‌` పేరుతో ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ మంచి విజ‌యాన్ని సాధించింది. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రారంభం కానుంద‌ట‌.