చైత‌న్య‌కు విడాకులిమ్మన్న నెటిజ‌న్‌..!


చైత‌న్య‌కు విడాకులిమ్మన్న నెటిజ‌న్‌..!
చైత‌న్య‌కు విడాకులిమ్మన్న నెటిజ‌న్‌..!

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది సమంత‌. పెళ్లి త‌రువాత సినిమాల ఎంపిక విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటిస్తున్న స‌మంత న‌ట‌కు ఆస్కారం వున్న చిత్రాల్ని మాత్ర‌మే అంగీక‌రిస్తోంది. లాక్‌డౌన్ స‌మ‌యంలో టెర్రాస్‌పై వెజిటెబుల్స్ పండించ‌డం మొద‌లుపెట్టి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇటీవ‌ల సాకి పేరుతో సొంతంగా క్లాతింగ్ బ్రాండ్ ని ప్రారంభించిన సామ్ గ‌త కొంత కాలంగా ఇంటి ప‌ట్టునే వుంటోంది.

`ఫ్యామిలీమ్యాన్ 2` సిరీస్‌లో న‌టించిన సామ్ ఇటీవ‌ల త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకుంది. ప్ర‌స్తుతం మ‌రో సిన‌మా కోసం రెడీ అవుతున్న స‌మంత తాజాగా నెటిజ‌న్ ల‌తో ముచ్చ‌టించింది. సోష‌ల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ లో నిత్యం బిజీగా వుంటూ వ‌రుస పోస్ట్‌ల‌తో సంద‌డి చేస్తోంది. తాజాగా ఇన్ స్టాలో `ఫీలింగ్ గుడ్‌` అంటూ ఓ ఫొటోని పోస్ట్ చేసింది.

దీంతో ఓ  నెటిజ‌న్ స‌మంత‌ని కామెంట్ చేశాడు. చైత‌న్య‌కు విడాకులు ఇచ్చేయ్ మ‌నం ఇద్ద‌రం పెళ్లిచేసుకుందాం` అని కామెంట్ చేశాడు. దీనికి సామ్ చాలా స్మార్ట్‌‌గా స్పందించింది. `క‌ష్టం.. ఒక ప‌నిచెయ్‌. చైని అడుగు` అని తెలివిగా స్పందించింది. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ ఇన్ స్టాలో వైర‌ల్ అవుతోంది.

 

View this post on Instagram

 

☀️

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on