స‌మంత అప్పుడే మొద‌లెట్టిందిగా!


Samantha started silently Family man 2 dubbing
Samantha started silently Family man 2 dubbing

దేశ వ్యాప్తంగా క‌రోనా క‌రాళ నృత్యం చేస్తున్నా సామాన్యులు, సెల‌బ్రిటీలు దాన్ని ప‌ట్టించుకోకుండా ఎవ‌రి ప‌నుల్లో వారు నిమ‌గ్న‌మౌతున్నారు. క‌రోనాతో క‌లిసి జీవ‌నం సాగిస్తున్నారు. క్రేజీ హీరోయిన్ స‌మంత కూడా సైలెంట్‌గా త‌న ప‌ని తాను చేసుకుపోతోంది. త‌ను తొలిసారి న‌టిస్తున్న వెబ్ సిరీస్ కోసం అప్పుడే డ‌బ్బింగ్ చెప్ప‌డం మొద‌లెట్టేసింది. స‌మంత న‌టిస్తున్న తొలి వెబ్ సిరీస్ `ఫ్యామిలీ మ్యాన్ 2`. రాజ్ నిడియోరు, కృష్ణ డీకే సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్‌ని రూపొందిస్తున్నారు.

మ‌నోజ్ బాజ్ పాయ్‌, ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన `ఫ్యామిలీ మ్యాన్‌` సిజ‌న్ 1 అనూహ్య విజ‌యాన్ని సాధించి పాపుల‌ర్ కావ‌డంతో సీజ‌న్ 2గా వ‌స్తున్న `ఫ్యామిలీ మ్యాన్ 2`పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. సీజ‌న్ 2 ఎప్పుడు పూర్త‌వుతుందా? ఎప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్ ద్వారానే స‌మంత డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. స‌మంత కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌టంతో ఈ సీజ‌న్‌పై అంచ‌నాలు మ‌రింత రెట్టింప‌య్యాయి.

ఇందులో స‌మంత నెగెటివ్ షేడ్స్ వున్న పాత్ర‌లో తీవ్ర వాదిగా క‌నిపిస్తుంద‌ని తెలుస్తోంది. తాజాగా త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ మొద‌లుపెట్టాన‌ని స‌మంత ఇన్ స్టా వేదిక‌గా ఓ ఫొటోని షేర్ చేసింది. `ఫ్యామిలీమ్యాన్ సీజ‌న్ 2`కు డ‌బ్బింగ్ చెబుతున్నాను. మీరు క్రేజీ రైడ్ కోసం వున్నారు. రాజ్ ఎన్ డీకే థ్యాక్ యూ` అని వెల్ల‌డించింది. స‌మంత ఈ సిరీస్‌కి తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో డ‌బ్బింగ్ చెబుతుండ‌టం విశేషం.