అల్లు అర‌వింద్ కోసం స‌మంత కొత్త స్టెప్‌!

Samantha stepping into samll screen
Samantha stepping into samll screen

సినిమాలకు స‌మాంత‌రంగా డిజిట‌ల్ కంటెంట్ పై క్రేజ్ పెరుగుతోంది. నిత్యం బిజీగా వుండే సామాన్యుడు ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలోకి వ‌చ్చాక అన్నీ అందులోనే చూసుకోవ‌డం మొద‌లుపెట్టాడు. దీన్ని అడ్వాంటేజ్‌గా తీరుకుని దేశ వ్యాప్తంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ఆమెరికాకు చెందిన నెట్ ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్‌, మ్యాక్స్ ప్లేయ‌ర్‌, ముంబైకి చెందిన ఆల్ట్ బాలాజీ. జీ5 లాంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ భార‌తీయ డిజిట‌ల్ మార్కెట్ ఆక్క‌ఫై చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ ద‌క్షిణాదిలో కొంత వ‌ర‌కు పాగా వేసేసింది.

వీటి నుంచి పోటీని త‌ట్టుకోవాలంటే స్థానికంగా కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్ ఉండాల‌ని ప్లాన్ చేసిన అల్లు అర‌వింద్ సొంతంగా మైహోమ్ రామేశ్వ‌ర‌రావు లాంటా వారిని భాగ‌స్వాములుగా చేసుకుని `ఆహా` పేరుతో డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌ని ఇటీవ‌ల ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. దీనికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌లే ఈ యాప్‌ని అధికారికంగా లాంచ్ చేశారు కూడా.

అయితే దీని కోసం కొత్త‌గా ఓ రియాలిటీ షోని అల్లు అర‌వింద్ ప్లాన్ చేసిన‌ట్టు తెలిసింది. ఇందు కోసం స‌మంత‌కు భారీ స్థాయిలో రెమ్యున‌రేష‌న్‌ని అల్లు అర‌వింద్ ఆఫ‌ర్ చేసిన‌ట్టు ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. స‌మంత న‌టించిన `జాను`ఇటీవ‌లే విడుద‌లైంది.
మ‌నోజ్ బాజ్‌పాయ్ న‌టిస్తున్న `ఫ్యామిలీమేన్ 2`లో స‌మంత న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే త‌న‌కు సంబంధించిన షూటింగ్‌ని ఫూర్తి చేసింది. `ఆహా` టాక్ షో డీల్ న‌చ్చ‌డంతో సామ్ వెంట‌నే ఓకే చెప్పిన‌ట్టు చెబుతున్నారు.