పూజా హెగ్డేకి స‌మంత గ‌ట్టి ఝ‌ల‌క్ ఇచ్చిన‌ట్టేనా?


పూజా హెగ్డేకి స‌మంత గ‌ట్టి ఝ‌ల‌క్ ఇచ్చిన‌ట్టేనా?
పూజా హెగ్డేకి స‌మంత గ‌ట్టి ఝ‌ల‌క్ ఇచ్చిన‌ట్టేనా?

స్టార్‌ హీరోయిన్స్ పూజా హెగ్డే,  సమంత‌ల మ‌ధ్య  ఇటీవ‌ల సోష‌ల్ మీడియా వేదిక‌గా మాట‌ల యుద్ధం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ముందు స‌మంత‌ని ఇండైరెక్ట్‌గా పూజా హెగ్డే విమ‌ర్శించింది. ఆ త‌రువాత ఇద్ద‌రి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జ‌రిగింది. పూజా హెగ్డే  సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టిన త‌రువాతే ఈ మాట‌ల యుద్ధం మొద‌లైంది. అయితే ఈ ట్విట్ట‌ర్ వార్‌లో స‌మంత తెలివిగా ప్ర‌వ‌ర్తించింది.

పూజా హెగ్డేని నేరుగా విమ‌ర్శించ‌కుండా చాలా స్పార్ట్‌గా వ్య‌వ‌హ‌రించి  చుర‌క‌లంటించింది. `ఆమె అందంగా ఉందా?` అంటూ సమంతా అందాన్ని ప్రశ్నించిన పూజా పోస్ట్ చాలా మందికి షాక్ ఇచ్చింది. ఏంటీ పూజా హెగ్డే ఇలా స్పందించింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు స‌మంత ఫ్యాన్స్ అవాక్క‌య్యారు. వెంట‌నే తేరుకుని పూజా హెగ్డేపై సోష‌ల్ మీడియాలో వార్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఎప్ప‌టికైనా సామ్ పూజాకు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పాల‌ని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి స‌మంత తాజాగా గుడ్ న్యూస్ చెప్పేసింది.

గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కిస్తున్న `శాకుంత‌లం` చిత్రం కోసం ముందు పూజా హెగ్డేని సంప్ర‌దించారు. అయితే ఈ చిత్రంలో న‌టించాలా వ‌ద్దా అని సెకండ్ థాట్ కోసం పూజా వేచి చూస్తున్న వేళ గుణ‌శేఖ‌ర్ అదే ఆఫ‌ర్‌ని స‌మంత‌కిచ్చారు. ఆఫ‌ర్, పాత్ర న‌చ్చ‌డంతో వెంట‌నే సామ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. దీంతో పూజా హెగ్డే అవాక్క‌వ్వాల్సి వ‌చ్చింది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో పూజా హెగ్డేకి స‌మంత ఈ రూపంలో గ‌ట్టి ఝ‌ల‌క్ ఇచ్చేసింద‌ని అభిమానులు పండ‌గ చేసుకుంటున్నార‌ట.