విజయ్ దేవరకొండకు సపోర్ట్ చేస్తున్న సమంత


samantha support to Vijay devarakondaగీత గోవిందం చిత్రంతో స్టార్ లీగ్ లో చేరిన విజయ్ దేవరకొండకు స్టార్ హీరోయిన్ సమంత బాసటగా నిలిచింది . విజయ్ దేవరకొండ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డాడని , ఎంతో శ్రమించాడని అందువల్లే ఈ స్థాయి అందుకున్నాడని …… ఇది ఊరికే వచ్చిన స్టార్ డం కాదని అంటోంది సమంత . మహానటి చిత్రంలో సమంతవిజయ్ దేవరకొండల జంట బాగుందని మంచి మార్కులు పడిన విషయం తెలిసిందే . అలాగే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది కూడా .

పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి చిత్రాలకు ముందు విజయ్ దేవరకొండ వేరు పైగా పెద్దగా అవకాశాలు కూడా లేవు కానీ ఎప్పుడైతే పెళ్లి చూపులు బ్లాక్ బస్టర్ అయ్యిందో విజయ్ దేవరకొండకు ఎనలేని క్రేజ్ వచ్చింది దానికి కొనసాగింపుగా అర్జున్ రెడ్డి ప్రభంజనం సృష్టించడంతో రేంజ్ పెరిగింది ఇక తాజాగా గీత గోవిందం చిత్రంతో స్టార్ హీరో అయిపోయాడు . అయితే కొంతమంది మాత్రం ఒకటి రెండు హిట్స్ రాగానే స్టార్ హీరో అయిపోరు అని కామెంట్ చేయడంతో విజయ్ దేవరకొండకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతోంది సమంత .

English Title: samantha support to Vijay devarakonda