ర‌కుల్‌కు సారీ చెప్పిన స్టార్ హీరోయిన్‌!

ర‌కుల్‌కు సారీ చెప్పిన స్టార్ హీరోయిన్‌!
ర‌కుల్‌కు సారీ చెప్పిన స్టార్ హీరోయిన్‌!

బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ హ‌త్య త‌రువాత నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో డ్ర‌గ్స్ కీల‌కంగా మార‌డంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది.  రియాకు డ్ర‌గ్స్ పెడ్ల‌ర్స్‌కు సంబంధం వుంద‌ని తేల‌డంతో ఈ కేసులో తీగ లాగినా కొద్దీ డొంక క‌దులుతోంది. దీంతో బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ కేసు తీవ్ర క‌లక‌లం రేపుతోంది.

నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచార‌ణ‌లో రియా 21 మంది సెల‌బ్రిటీల పేర్ల‌ని వెల్ల‌డించింద‌ని, అందులో ర‌కుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా వుంద‌ని ప‌లు వార్తా చాన‌ల్స్‌తో పాటు జాతీయ మీడియాలోనూ క‌థ‌నాలు వినిపించాయి. అయితే తాజాగా ఎన్‌సీబీ అధికారులు మాత్రం రియా ఎలాంటి పేర్లు వెల్ల‌డించ‌లేద‌ని, త‌మ వ‌ద్ద సెల‌బ్రిటీల‌కు సంబంధించి ఎలాంటి లిస్ట్ లేద‌ని చెప్ప‌డంతో ర‌కుల్‌ని అనుమానించిన వారంతా ఇప్పుడు నాలుక క‌రుచుకుంటున్నారు. త‌మ తొంద‌ర పాటుకు నిందించుకుంటున్నారు.

ఇదిలా వుంటే తాజాగా ఎన్‌సీబీ అధికారులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం ర‌కుల్ పేరు లేక‌పోవ‌డంతో స‌మంత ఆమెకు అండ‌గా నిలిచారు. ఇటీవ‌ల నెటిజ‌న్స్ ట్రోలింగ్ చేయ‌డం వైర‌ల్ కావ‌డంతో ముందుకొచ్చిన స‌మంత త‌న స‌పోర్ట్ ర‌కుల్‌, సారాకే అని ఇన్ స్టా వేదిక‌గా వెల్ల‌డించి సారీ ర‌కుల్‌, సారీ సారా అనే హ్యాష్ ట్యాగ్‌ల‌ని జోడించింది. దీంతో నెటిజ‌న్స్ చాలా వ‌ర‌కు సారీ ర‌కుల్‌, సారీ సారా అంటూ ట్వీట్ చేయ‌డం మొద‌లుపెట్టారు.