తల్లితో గొడవలు లేవంటున్న సమంత


సమంత తన తల్లి తో విబేధించిందని కొంత కాలంగా ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయని కనీసం మాట్లాడుకునే పరిస్థితి లేదని మీడియాలో కథనాలు పెద్ద ఎత్తున వచ్చాయి , ఇప్పటికి కూడా వచ్చి పడుతున్నాయి దాంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి సమంత తాజాగా తన తల్లి ఫోటో ని ట్వీట్ చేసి తల్లి గొప్పతనం గురించి పోస్ట్ పెట్టింది . దాంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందని ఇలా చేసిందేమో సమంత .

అయితే నిప్పు లేనిదే పొగ రాదుగా ! సమంత కు ఆమె తల్లికి మధ్య మనస్పర్థలు వచ్చిన మాట నిజమే 1 అయితే అవి మరీ పెద్దవి కాదు సహజంగానే తల్లిదండ్రులతో ఏదో విషయంలో ప్రతీ మనిషి విబేధిస్తూనే ఉంటాడు . అలానే సమంత కు ఆమె తల్లి కి మధ్య తేడాలు వచ్చాయి అంతే ! అయితే అవి బద్ద శత్రువులు అయ్యేంత పెద్దవి కాదు . కోపం వచ్చినప్పుడు అలగడం తర్వాత కలిసి పోవడం కామన్ ! ఇక మజిలీ తో మంచి హిట్ కొట్టడంతో చాలా సంతషంగా ఉంది సమంత .