నందిని రెడ్డి – సమంత ల కాంబినేషన్ లో మరో సినిమా


Samantha And Nandhini Reddy
Samantha And Nandhini Reddy

ఓ బేబీ సూపర్ హిట్ కావడంతో ఫుల్ జోష్ గా ఉన్న నందిని రెడ్డి – సమంత లు మళ్ళీ సినిమా చేయడానికి ఓ అంగీకారానికి వచ్చారట . అయితే ఈ సినిమా ఇప్పుడే కాదు ఎందుకంటే సమంత కు ఒప్పుకున్న చిత్రాలు ఉన్నాయి అలాగే నందిని రెడ్డి కూడా ఒప్పుకున్న సినిమాలు ఉన్నాయి కాబట్టి అవి అయ్యాక చేయనున్నారు . ఇంతకుముందు నందిని రెడ్డి – సమంత ల కాంబినేషన్ లో జబర్దస్త్ వంటి డిజాస్టర్ వచ్చింది .

కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత ఓ బేబీ వంటి బ్లాక్ బస్టర్ వచ్చింది . ఓ బేబీ సూపర్ హిట్ కావడంతో అటు సమంత ఇటు నందిని రెడ్డి ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు . అందుకే మళ్ళీ సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యారట . కాకపోతే మంచి కథ సెట్ అయ్యాకే చేయాలనీ డిసైడ్ అయ్యారట .