`ల‌వ్‌స్టోరీ` కోసం తెలంగాణ ప‌ల్లెపాట‌!

Samantha to launch saranga dariya song from lovestory
Samantha to launch saranga dariya song from lovestory

తెలంగాణ జాన‌ప‌దాలు ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు ప‌ల్లెల్లో పాపుల‌ర్ అయ్యాయి. వాటిని సినిమాల్లో పాట‌లుగా క‌ట్టి మ‌రింత ప్రాచూర్యాన్ని క‌ల్పించారు. వెండితెర‌పై ఆ పాట‌లు చాలా వ‌ర‌కు సూప‌ర్ హిట్ట‌య్యాయి. అదే బాట‌లో మ‌రో తెలంగాణ ప‌ల్లెల్లో ప్ర‌తీ నోట నానిన ఓ జాన‌ప‌దాన్ని `ల‌వ్‌స్టోరీ` మూవీ కోసం శేఖ‌ర్ క‌మ్ముల తీసుకొస్తున్నారు. నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్న చిత్రం `ల‌వ్‌స్టోరీ`.

సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్‌, పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలంగాణలోని ఓ మారుమూల గ్రామం నుంచి సిటీకి వ‌చ్చిన ఓ ప్రేమ జంట క‌థ‌గా ఈ చిత్రాన్ని శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన `సారంగ ద‌రియా ..` అంటూ సాగే ఓ జాన‌ప‌ద గీతాన్ని ఈ నెల 28న ఉద‌యం 10:08 గంట‌ల‌కు స్టార్ హీరోయిన్ సమంత రిలీజ్‌చేయ‌బోతోంది.

తెలంగాణ ప‌ల్లెల్లో `సారంగ ద‌రియా ..` మారు మోగిన జాన‌ప‌ద గీతం. `ల‌వ్‌స్టోరీ` కోసం ఈ పాట‌ని సుద్ధాల అశోక్ తేజ రాయ‌గా, మంగ్లీ ఆల‌పించింది. ఈ పాట‌కు సాయి ప‌ల్ల‌వి డ్యాన్స్ ఓ రేంజ్‌లో ఇర‌గ‌దీసింద‌ట‌. ఈ పాటే సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంద‌ని, బ్లాక్ బ‌స్ట‌ర్ గా సినిమాని నిల‌ప‌బోతోంద‌ని తెలుస్తోంది. డ్యాన్స్ అంటే మెరుసుతీగ‌లా మెలిక‌లు తిరిగే సాయి ప‌ల్ల‌వి ఈ పాట‌లో ఏ రేంజ్‌లో దుమ్ము దులిపేసింద‌న్న‌ది తెలియాలంటే ఈ పాట రిలీజ్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.