మూగ పాత్ర‌లో స్టార్ హీరోయిన్‌?


మూగ పాత్ర‌లో స్టార్ హీరోయిన్‌?
మూగ పాత్ర‌లో స్టార్ హీరోయిన్‌?

స‌మంత ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో న‌టించ‌బోతోందా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. `రంగ‌స్థ‌లం` చిత్రంతో విభిన్న పాత్ర‌ల్ని ఎంచుకుంటూ కొత్త బాట ప‌ట్టిన స‌మంత మ‌హాన‌టి, యూట‌ర్న్‌, సూప‌ర్ డీల‌క్స్‌, మ‌జిలీ, ఓ బేబీ వంటి విభిన్న చిత్రాల్లో న‌టించింది. `ఫ్యామిలీ మ్యాన్ 2`లో టెర్రరిస్టుగా నెగెటివ్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న సామ్ తాజాగా మ‌రో ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది.

`గేమ్ ఓవ‌ర్‌` ఫేమ్ అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో స‌మంత ఓ ప్ర‌యోగాత్మ‌క మూవీ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌పైకి రానున్న ఈ చిత్రంలో స‌మంత మూగ అమ్మాయిగా క‌నిపించ‌నుంద‌ట‌. మ‌హిళా ప్ర‌ధాన చిత్రంగా రూపొంద‌నున్న ఈ మూవీని సోనీ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మించ‌బోతోంది.

తెలుగు, త‌మిళ భాష‌ల్లో స‌మంత‌కున్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ ఈ చిత్రాన్ని ద్వి భాషా చిత్రంగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందించ‌బోతున్నారు. దీంతో ఈ చిత్రంపై భారీ క్రేజ్ ఏర్ప‌డింది. అనుష్క తాజాగా మూగ‌, చెవిటి యువ‌తిగా `నిశ్శ‌బ్దం` చిత్రంలో న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ త్వ‌ర‌లోనే ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాబోతోంది.