సినిమాలకు సమంత బ్రేక్ ఇవ్వనుందా?


Samantha
సినిమాలకు సమంత బ్రేక్ ఇవ్వనుందా?

పెళ్ళైన దగ్గరనుండి సమంత కెరీర్ కొత్త టర్న్ తీసుకుంది. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ తనకంటూ భిన్నమైన ఇమేజ్ ను సంపాదించుకుంటోంది. ఫీమేల్ సెంట్రిక్ కథలకు సమంత ఒక కొత్త ఆప్షన్ గా తయారైంది. ప్రస్తుతం సమంత 96′ తెలుగు రీమేక్ లో నటిస్తోంది. అయితే ఈ చిత్రం తర్వాత సమంత ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఒక ఫీమేల్ సెంట్రిక్ కథను అనుకుంటున్నారు కానీ అది తయారవ్వడానికి ఇంకా టైమ్ పడుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే మరొక వాదన కూడా నడుస్తోంది. సమంత కావాలనే 96‘ చిత్ర రీమేక్ తర్వాత బ్రేక్ తీసుకుంటుందని, అందుకనే కొత్త సినిమాలు ఏవీ ఒప్పుకోవట్లేదని అంటున్నారు. తల్లి అవ్వాలని సమంత అనుకుంటోందిట, అందుకే సినిమాల నుండి బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే సమంత క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.