ప్ర‌తీ సినిమాకు భ‌య‌ప‌డుతుంటాను!


Samantha too much confidence on jaanu
Samantha too much confidence on jaanu

పెళ్లి త‌రువాత కొత్త త‌ర‌హా చిత్రాల్లో మాత్ర‌మే న‌టిస్తోంది స‌మంత‌. న‌ట‌న‌కు, త‌న పాత్ర‌కు ప్రాధాన్య‌త వున్న చిత్రాల్ని మాత్ర‌మే ఎంచుకుంటూ వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకుంటోంది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు సామ్ న‌టించిన చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధిస్తున్నాయి. ఇదే కోవ‌లో సామ్ న‌టించిన మ‌రో ఫీల్ గుడ్ ల‌వ్‌స్టోరీ `జాను`. శ‌ర్వంద్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని `96` ఫేమ్ ప్రేమ్‌కుమార్ రూపొందిస్తున్నారు.

టీజ‌ర్ నుంచే ఆస‌క్తిరేకెత్తిస్తున్న ఈ సినిమా సామ్ కెరీర్‌లో మ‌రో ఫీల్ గుడ్ సినిమాగా మిలిలిపోయేలా క‌నిపిస్తోంది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌, ఫీల్ గుడ్ చిత్రాల్ని అందించే బ్యాన‌ర్‌గా పేరుతెచ్చుకున్న దిల్ రాజు బ్యాన‌ర్‌లో కూడా ఇదొక మ‌ర‌పురాని చిత్రంగా మిగిలిపోతుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి.
ప్రీరిలీజ్ వేడ‌క‌లో సామ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది.

స‌మంత మాట్లాడుతూ `అభిమానుల‌ని నిరుత్సాహ‌ప‌ర‌చ‌కూడ‌ద‌నే ప్ర‌తి సినిమాకు భ‌య‌ప‌డుతుంటాను. అందుకే ప్ర‌తి సినిమాను తొలి సినిమాగానే భావిస్తాను. క్లాసిక్ చిత్రాకిది రీమేక్‌.  దీని గురించి ఇప్పుడు ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ నెల 7 త‌రువాత సినిమా గురించి మాట్లాడ‌తాను. ఈ సినిమా షూటింగ్‌లో ప్ర‌తిరోజూ ఏదో ఒక మ్యాజిక్ జ‌రుగుతూనే వుంది. ఈ సినిమా అభిమానులు గ‌ర్వంగా ఫీల‌య్యేలా వుంటుంది` అని తెలిపింది.