మహేష్ బాబు పై ట్వీట్ చేసిన సమంత


సూపర్ స్టార్ మహేష్ బాబు పై ట్వీట్ చేసి మరోసారి సంచలనం సృష్టించింది సమంత . అయితే ఒకప్పుడు ట్వీట్ చేసి వివాదాన్ని రాజేసిన సమంత ఈసారి మాత్రం మహేష్ బాబు కు బెస్ట్ విషెష్ చెప్పడం విశేషం . తాజాగా మహేష్ బాబు మహర్షి చిత్రం విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ఆ సినిమాకు అనూహ్యంగా పెద్ద ఎత్తున బజ్ వస్తోంది . ఓవర్ సీస్ లో అయితే ఈ సినిమాకు విపరీతమైన డిమాండ్ ఉంది ఇలాంటి సమయంలో సమంత ట్వీట్ చేయడం మహేష్ కు విషెష్ చెప్పడం విశేషమే మరి .

మహేష్ నటించిన 1 నేనొక్కడినే సమయంలో హీరోయిన్ మహేష్ కాళ్ళ దగ్గర ఉన్న స్టిల్ పై ట్వీట్ చేసి పెద్ద దుమారం రాజేసింది సమంత . దాంతో మహేష్ బాబు ఫ్యాన్స్ సమంత ని అప్పటి నుండి శత్రువుగా చూస్తున్నారు , విపరీతంగా ట్రోల్ కూడా చేసారు . కట్ చేస్తే ఆ గొడవ సమసిపోయింది . మహేష్ బాబు – సమంత ల కాంబినేషన్ లో దూకుడు , సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సూపర్ హిట్స్ వచ్చాయి .