కొత్త పెళ్లికూతురుకు వెల్క‌మ్ చెప్పేసింది!Samantha welcomes Miheeka bajaj daggubati family
Samantha welcomes Miheeka bajaj daggubati family

కొత్త‌గా పెళ్లై త‌మ కుటుంబంలోకి ఎంట‌ర‌వుతున్న వాళ్ల‌కు సాద‌రంగా ఆహ్వానం ప‌లుకుతాం. వారిని ఇక ఈ రోజు నుంచి త‌మ ఇంటి వారుగా, త‌మ కుటుంబంలోని వ్య‌క్తిగా భావిస్తాం. స్టార్ హీరోయిన్ సమంత కూడా ఇదే ప‌ని చేసింది.  ద‌గ్గుబాటి వారి ఇంట ఈ నెల 8న పెళ్లి బాజా మోగింది. హీరో ద‌గ్గుబాటి రానా, ముంబై ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంప‌నీ న‌డుపుతున్న మిహీకా బ‌జాజ్ ఇరు కుటుంబాల అంగీకారంతో వేద మంత్రాల సాక్షిగా ఒక్క‌ల‌య్యారు.

రామానాయుడు స్టూడియోస్‌లో జ‌రిగిన ఈ వివాహ వేడుక‌కు అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన ఈ పెళ్లి వేడుక‌లో అక్కినేని వారి కోడ‌లు స‌మంత ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిలిచింది. ప్ర‌ముఖ కాస్ట్యూమ్ డిజైన‌ర్ అర్పిత డిజైన్ చేసిన డ్రెస్‌ని ధ‌రించిన సామ్ పెళ్లిలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నాగ‌చైత‌న్య ద‌గ్గుబాటి ఫ్యామిలీకి మేన‌ల్లుడు అన్న విష‌యం తెలిసిందే. దీంతో సామ్ కూడా ఈ ఫ్యామిలీకి బంధువే.

ఈ నేప‌థ్యంలో స‌మంత పెట్టిన పోస్ట్ ఆక‌ట్టుకుంటోంది. స‌మంత‌కు రానా అన్న‌య్య అవుతాడు. మిహీకా వ‌దిన అవుతుంది. ఆ బంధాన్ని దృష్టిలో పెట్టుకుని స‌మంత సోష‌ల్ మీడియా వేదిక‌గా మిహీకాకు ద‌గ్గుబాటి ఫ్యామిలీ త‌రుపున వెల్క‌మ్ చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది. `అంద‌మైన మహీకా … కుటుంబంలోకి నీకు స్వాగ‌తం` అని ద‌గ్గు బాటి ఫ్యామిలీతో క‌లిసి చై, తానూ క‌లిసి వున్న ఓ ఫొటోని షేర్ చేసింది.