ఆ డ్రెస్ కాస్ట్ వింటే షాక‌వ్వాల్సిందే!ఆ డ్రెస్ కాస్ట్ వింటే షాక‌వ్వాల్సిందే!
ఆ డ్రెస్ కాస్ట్ వింటే షాక‌వ్వాల్సిందే!

ఇటీవ‌ల జ‌రిగిన జీ సినీ అవార్డ్స్‌లో స‌మంత ఎల్లోక‌ల‌ర్ ట్రాన్స్‌ప‌రెంట్ డ్రెస్‌లో క‌నిపించి అంద‌రిని షాక్‌కు గురిచేసింది. ఉన్న‌ట్టుంది స‌మంత‌ని ఆ డ్రెస్‌లో చూసి కంగారు ప‌డ్డ అక్కినేని ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జీ సినీ అవార్డ్స్‌లో సామ్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచినా ఫ్యాన్స్‌కు మాత్రం ఆగ్ర‌హాన్ని తెప్పించింది. అయితే ఈ డ్రెస్ కాస్ట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

దీని గురించి తెలుసుకున్న వాళ్లు ఈ డ్రెస్ కాస్ట్ ఇంతా అని షాక‌వుతున్నార‌ట‌. `జోనాథ‌న్ సిమ్కాయి` డిజైన్‌గా పేరున్నఈ డిజైన్ డ్రెస్ ఖ‌రీదు అక్ష‌రాలా రెండు ల‌క్ష‌లు అని తెలుస్తోంది. ఇంత భారీ మొత్తం పెట్టి ఇలాంటి ట్రాన్స్‌ప‌రెంట్ డ్రెస్ కొన‌డం ఎంద‌కు అని ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. సమంత మాత్రం ఈ సెటైర్ల‌ని ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు.

ప్ర‌స్తుతం స‌మంత త‌మిళ హిట్ చిత్రం `96` ఆధారంగా రూపొందుతున్న `జాను` చిత్రంలో న‌టిస్తోంది. చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకున్నఈ చిత్రాన్నినిర్మాత దిల్ రాజు త్వ‌ర‌లోనే రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుండ‌గా స‌మంత `ఫ్యామిలీ మ్యాన్ 2`తో బాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతోంది. మ‌నోజ్ బాజ్‌పాయ్ న‌టిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు రాజ్ ఎన్ డీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.