సమంత 5 నెలల‌కు అంత‌ వసూలు చేస్తోందా?

సమంత 5 నెలల‌కు అంత‌ వసూలు చేస్తోందా?
సమంత 5 నెలల‌కు అంత‌ వసూలు చేస్తోందా?

త‌మిళ హిట్ చిత్రం `96` ఆధారంగా రూపొందిన చిత్రం `జాను`. శ‌ర్వా హీరోగా న‌టించిన ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా టైటిల్ పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. భారీ అంచ‌నాలు పెట్టుకున్న ఈ మూవీ 2020 ఫిబ్ర‌వ‌రిలో విడుద‌లై దారుణ ఫ‌లితాన్ని చ‌విచూసింది. దీంతో షాక్‌కి గురైన స‌మంత ఆ త‌రువాత ఎలాంటి సినిమా అంగీక‌రించ‌లేదు. త‌న త‌దుప‌రి చిత్రం కోసం కొంత స‌మ‌యం తీసుకుంది.

ఫైన‌ల్‌గా దర్శకుడు గుణశేఖర్ తెర‌కెక్కించ‌బోతున్న మైథ‌లాజిక‌ల్ చిత్రం `శాకుంతలం`కు ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ పౌరాణిక నాటకం రెగ్యులర్ షూటింగ్ ఈ సోమ‌వారం నుంచి లాంఛ‌నంగా ప్రారంభం కాబోతోంది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సమంత 150 పనిదినాలను కేటాయించింది. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన చిత్రాల్లో ఈ స్థాయిలో డేట్స్ కేటాయించ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.

సమంతా ఎక్కువగా `శాకుంతలం` పై దృష్టి పెట్ట‌బోతోంద‌ని, త్వరలో ఏ కొత్త చిత్రానికి సంతకం చేయకపోవచ్చునని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు 3 కోట్లు వ‌సూలు చేస్తోంద‌ట స‌మంత‌. అందుకు మేక‌ర్స్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. ఇందులో  మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడిగా నటించనున్నారు. గుణశేఖర్ తన సొంత బ్యాన‌ర్  గుణా టీం వర్క్స్ పతాకంపై ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. మణి శర్మ దీనికి సంగీతం సమకూర్చుతున్నారు.