35 కోట్ల క్లబ్ లో సమంత ఓ బేబీ


Oh Baby Collections
Oh Baby Collections

సమంత నటించిన ఓ బేబీ చిత్రం 35 కోట్ల క్లబ్ లో చేరింది . జూలై 5 న విడుదలైన ఓ బేబీ చిత్రానికి ప్రేక్షకలోకం నీరాజనాలు పలుకుతోంది దాంతో రెండు వారాల్లోనే 35 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది . 35 కోట్ల గ్రాస్ వసూళ్లు దాదాపు 20 కోట్ల షేర్ ని సాధించింది ఓ బేబీ చిత్రం . స్టార్ హీరో ఎవరూ లేకపోయినా సమంత ఈ అరుదైన ఫీట్ ని సాధించి సంచలనం సృష్టించింది .

నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఓ బేబీ చిత్రానికి మాతృక కొరియన్ సినిమా . కాగా ఆ కొరియన్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్పులు చేసి మెప్పించారు . దాంతో తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఓన్ చేసుకున్నారు . ఇక సమంత నటజీవితంలో మరో మైలురాయిగా నిలిచింది ఓ బేబీ చిత్రం . సమంత తో పాటుగా జగపతిబాబు , రాజేంద్రప్రసాద్ , లక్ష్మీ , నాగశౌర్య , తేజ , అడవి శేష్ , రావు రమేష్ , తదితరులు నటించారు ఈ ఓ బేబీ చిత్రంలో .