సమంతతో ఎంజాయ్ మాములుగా ఉండదట


సమంతతో ఎంజాయ్ మాములుగా ఉండదట

Samantha Oh Baby Teaser Talk

నాతో ఎంజాయ్ మెంట్ మాములుగా ఉండదు అంటూ ఊరిస్తోంది సమంత . తాజాగా ఈ భామ నటించిన చిత్రం ” ఓ బేబీ ”. మహిళా దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది ఈ చిత్రం . కొరియన్ చిత్రం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ ని కొద్దిసేపటి క్రితం విడుదల చేసారు . నిమిషం కు పైగా నిడివి ఉన్న ఈ టీజర్ తో సమంత ఎంజాయ్ చేయడానికి తన దగ్గరకు రమ్మంటోంది .

టీజర్ ఆకట్టుకునేలానే ఉంది , సమంత తో పాటుగా ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ , రావు రమేష్ లు నటించారు . ఇక కీలక పాత్రలో అలనాటి హీరోయిన్ లక్ష్మి నటించింది . ఇక హీరోగా నాగశౌర్య నటించాడు . వరుస విజయాలతో సమంత దూసుకుపోతోంది . ఇక ఓ బేబీ తో ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఎదురు చూడాల్సిందే .