బాలయ్య – బోయపాటి సినిమాకు సమరసింహారెడ్డి లింకప్బాలయ్య - బోయపాటి సినిమాకు సమరసింహారెడ్డి లింకప్
బాలయ్య – బోయపాటి సినిమాకు సమరసింహారెడ్డి లింకప్

నందమూరి బాలకృష్ణకు 2019 అస్సలు కలిసి రాలేదు. తను నటించిన మూడు సినిమాలు కూడా దారుణమైన ప్లాప్స్ గా మిగిలాయి. అయితే 2020లో తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు బాలయ్య బాబు. ఇందుకోసం తనకు రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనును తన తర్వాతి సినిమా కోసం ఎంచుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే షూటింగ్ మొదలుకావాల్సి ఉన్నా ఎందుకనో ఆలస్యమైంది. ఫిబ్రవరి 26 నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా కథ విషయంలో ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి.

అందులో ప్రముఖంగా వినిపిస్తున్న వార్త, ఇందులో బాలకృష్ణ అఘోరాగా కనిపించనున్నాడని తెలుస్తోంది. దానికి తగ్గట్లుగానే బాలకృష్ణ గుండుతో ఉన్న లుక్ తో బయట దర్శనమిస్తున్న సంగతి తెల్సిందే. ఇక దీనికి కొనసాగింపు బజ్ ఏంటంటే ఈ సినిమాకు బాలయ్య కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సమరసింహారెడ్డి లుక్ కు దగ్గరి పోలికలు ఉన్నాయిట. అందులో బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ లో ఫ్యాక్షనిస్ట్ గా కనిపిస్తాడన్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య ఫ్యాక్షనిస్ట్ గాకనిపిస్తాడట. ఈ రోల్ ను చాలా పవర్ఫుల్ గా తీర్చిదిద్దనున్నాడట బోయపాటి శ్రీను. ఇక ప్రెజంట్ సీన్లలో అఘోరాగా దర్శనమిస్తాడట. ఫ్యాక్షనిస్ట్ పాత్ర నుండి అఘోరాగా బాలయ్య ఎందుకు మారవలసి వచ్చింది అనే పాయింట్ సినిమాలో కీలకమని చెబుతున్నారు.

ఫస్ట్ షెడ్యూల్ లోనే అఘోరా ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ సినిమా విజయం బాలయ్యకు కీలకం. తను హీరోగా తిరిగి సత్తా చాటాలంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించాలి. మరి చూద్దాం ఈ చిత్రం ఎటువంటి ఫలితాన్ని అందుకుంటుందో.