సంప‌త్ నంది ప‌ని బాగుందిగా!


సంప‌త్ నంది ప‌ని బాగుందిగా!
సంప‌త్ నంది ప‌ని బాగుందిగా!

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచానికి చాలా పాఠాలు నేర్పుతోంది. రెగ్య‌ల‌ర్‌గా ఆలోచిస్తే బండిన‌డ‌వ‌డం క‌ష్ట‌మ‌నే సంకేతాల‌తో పాటు కొత్త పంథాలో బ్ర‌తుకు బండిని న‌డిపించాల‌ని చెప్పేసింది. దీంతో చాలా మంది కొత్త మార్గాల‌ని ఆన్వేషించ‌డం మొద‌లుపెట్టారు. ఇక టాలీవుడ్ ద‌ర్శ‌కుల తీరు స‌రేస‌రి. క‌రోనాతో భారీ చిత్రాల నిర్మాణం ఆగిపోవ‌డంతో ఆ స‌మ‌యాన్ని కొత్త క‌థ‌ల కోసం స‌ద్విన‌యోగం చేసుకుంటున్నారు.

యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సంప‌త్‌నంది `సీటీమార్‌` చిత్రాన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే. క‌రోనా కార‌ణంగా ఈ మూవీ షూటింగ్‌ని నిర‌వధికంగా ఆపేశారు. దీంతో ఈ టైమ్‌ని మ‌రో స్క్రిప్ట‌ఖి కేటాయించ‌న సంప‌త్ నంది `బ్లాక్ రోజ్‌` క‌థ‌ని సిద్ధం చేశారు. ఇందులో బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ ఊర్వ‌శీ రౌతేలా హీరోయిన్‌గా నిస్తోంది. ఇదిలా వుంటే తాజాగా మ‌రో చిత్రానికి సంప‌త్‌నంది క‌థ, మాట‌లు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. అదే `ఓదెల రైల్వే స్టేష‌న్‌`. కె. కె. రాధామోహ‌న్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా అశోక్ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

వ‌శిష్ట సింహా, హెబా ప‌టేల్‌, సాయిరోన‌క్‌, పూజిత పొన్నాడ‌, నాగ‌మ‌హేష్‌, భూపాల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. క‌న్న‌డ చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న వ‌శిష్ట సింహా హీరోగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది స్వ‌గ్రామం ఓదెల లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.