2 లక్షల విరాళం ఇచ్చిన సంపూర్ణేష్ బాబు


Sampoornesh babu 2 lakhs donates For Karnataka floods
Sampoornesh babu 2 lakhs donates For Karnataka floods

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కర్ణాటక అతలాకుతలం అయిన విషయం తెలిసిందే . కర్ణాటకలోని పలు ప్రాంతాలు వరద భీభత్సానికి ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడ్డారు . కట్టుబట్టలతో రోడ్డున పడటంతో వరదలు సృష్టించిన విలయానికి చలించిన సంపూర్ణేష్ బాబు తనవంతు సహాయంగా 2 లక్షల విరాళాన్ని ప్రకటించాడు . సంపూర్ణేష్ బాబు పెద్ద మనసు చేసుకొని 2 లక్షల విరాళం ప్రకటించడంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది .

సంపూర్ణేష్ బాబు చిన్న నటుడు అన్న సంగతి తెలిసిందే . చిన్న వాడైనప్పటికీ పెద్ద మనసుతో 2 లక్షలు ఇవ్వడంతో సోషల్ మీడియాలో సంపూ ని మెచ్చుకుంటున్నారు . గతకొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటక , కేరళ లోని పలు ప్రాంతాలు నీట మునిగిన విషయం తెలిసిందే .