సంపూ వస్తున్నాడు జాగ్రత్త !


Kobbarimatta
Kobbarimatta

సంపూర్ణేష్ బాబు వస్తున్నాడు జాగ్రత్త ! తెలుగు సినిమా ఊపిరి పీల్చుకో ……. ఆగస్టు 10 న సంపూర్ణేష్ బాబు వస్తున్నాడు బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి అని అంటున్నారు సంపూ ఫ్యాన్స్ . టాలీవుడ్ లో హృదయ కాలేయం చిత్రంతో చరిత్ర సృష్టించిన సంపూ తాజాగా కొబ్బరిమట్ట అంటూ వస్తున్నాడు . ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం పోషిస్తున్నాడు సంపూ .

నిన్న సాయంత్రం మూడు నిమిషాలకు పైగా ఉన్న డైలాగ్ ట్రైలర్ ని విడుదల చేసారు కొబ్బరిమట్ట మేకర్స్ . ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . అయితే ఈ డైలాగ్ పట్ల ఫిదా అయ్యేవాళ్లు ఉన్నారు అలాగే నీ మొహం చూడలేంరా బాబూ ! అంటూ సంపూ ని తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు . అయితే తిట్టినా , పొగిడినా డోంట్ కేర్ అంటూ ముందుకు సాగుతున్నాడు సంపూ . ఆగస్టు 10 న కొబ్బరిమట్ట చిత్రం విడుదలకు సిద్ధమైంది . ఇక ఈ సినిమా కూడా హృదయ కాలేయం లా పెద్ద హిట్ అవుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు .