ఊపిరి పీల్చుకో తెలుగు సినిమా ! సంపూ సినిమా వస్తోంది !!


Kobbarimatta
Kobbarimatta

ఊపిరి పీల్చుకో తెలుగు సినిమా ! ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సంపూర్ణేష్ బాబు సినిమా రిలీజ్ కి సిద్ధమైంది . హృదయ కాలేయం చిత్రంతో సంచలన విజయం సాధించి టాలీవుడ్ ని షేక్ చేసిన హీరో సంపూర్ణేష్ బాబు . 2014 లో హృదయ కాలేయం చిత్రం రిలీజ్ అయిన తర్వాత కొబ్బరిమట్ట అనే చిత్రాన్ని ప్రకటించారు . అయితే సినిమా ఇన్నాళ్ళుగా నానుతూనే ఉంది కానీ రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం తెలియకుండా పోయింది

కట్ చేస్తే తాజాగా కొబ్బరి మట్ట చిత్రాన్ని రిలీజ్ చేసేది ఎప్పుడు అనేది రేపు ప్రకటించనున్నారు చిత్ర బృందం . కొబ్బరిమట్ట చిత్రంలో సంపూర్ణేష్ బాబు మూడు పాత్రల్లో నటిస్తున్నాడు . రేపు డేట్ అనౌన్స్ చేస్తున్నాడు కాబట్టి సంపూ సందడి మళ్ళీ మొదలు అవుతుందేమో చూడాలి