మరో సంచలనానికి సిద్దమౌతున్న సంపూర్ణేష్ బాబు


sampoornesh babu
sampoornesh babu

సంపూర్ణేష్ బాబు మరో సంచలనానికి సిద్ధం అవుతున్నాడు . ఇటీవలే కొబ్బరిమట్ట చిత్రంతో సంచలనం సృష్టించిన సంపూ మరో సెటైరికల్ కామెడీ చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . విశేషం ఏంటంటే హృదయ కాలేయం , కొబ్బరిమట్ట వంటి హిట్ చిత్రాలను నిర్మించిన సాయి రాజేష్ నిర్మించడానికి ముందుకు రావడం గమనార్హం . కొబ్బరిమట్ట చిత్రానికి ముందు ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో మళ్ళీ సినిమాని తీస్తానో ? లేదో ? అన్న అనుమానం వ్యక్తం చేసాడు సాయి రాజేష్ .

కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ భారీ వసూళ్లు సాధించింది కొబ్బరిమట్ట . అలాగే శాటిలైట్ , డిజిటల్ రైట్స్ , డబ్బింగ్ రైట్స్ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాయి దాంతో మరో సినిమాకు శ్రీకారం చుడుతున్నారు ఇదే టీమ్ . సంపూ కి సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్ వచ్చింది దాంతో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి .