సంపూ కి హ్యాండ్ ఇచ్చిన మోహన్ బాబు


Sampoornesh babu And Mohan Babu
Sampoornesh babu And Mohan Babu

సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన కొబ్బరిమట్ట చిత్ర ప్రీ రిలీజ్ వేడుక కు మోహన్ బాబు వస్తారని ప్రచారం సాగింది కానీ తీరా సమయానికి మోహన్ బాబు రాకపోవడంతో పెద్ద చర్చే అయ్యింది . దాంతో మోహన్ బాబు సంపూ కి హ్యాండ్ ఇచ్చాడు అంటూ పెద్ద చర్చ సాగుతోంది . పెదరాయుడు మోహన్ బాబు కొబ్బరిమట్ట బృందాన్ని ఆశీర్వదించడానికి వస్తున్నాడు అంటూ సంపూ ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు అంతేకాదు ఓ పోస్టర్ కూడా పెట్టాడు . దాంతో తప్పకుండా మోహన్ బాబు వస్తారని ఆశించారు .

అయితే ప్రీ రిలీజ్ వేడుకకు మోహన్ బాబు రాకపోవడంతో ఆ చిత్ర బృందం షాక్ అయ్యింది . మోహన్ బాబు కొబ్బరిమట్ట వేడుకకు రాకపోవడానికి తెరవెనుక కొంతమంది నడిపించిన మంత్రాంగం కావచ్చు అని వినబడుతోంది . ఇక మరో కారణం కూడా ఏంటంటే మోహన్ బాబు ఉండేది శంషాబాద్ దగ్గరలో దాంతో ట్రాఫిక్ జామ్ అని తెలియడంతో రాకుండాపోయారు అని . మరి ఏది నిజమో !