3 రోజుల్లో 12 కోట్లు వసూల్ చేసిన కొబ్బరిమట్ట


Kobbari Matta 3 days collections
Kobbari Matta 3 days collections

సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన కొబ్బరిమట్ట చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లో 12 కోట్ల ని వసూల్ చేసి సంచలనం సృష్టించింది . చిన్న చిత్రం అందునా సెటైరికల్ కామెడీ చిత్రం అయినప్పటికీ పెద్ద హీరోల మాదిరి వసూళ్లు సాధించడంతో ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యానికి లోనౌతున్నారు . సంపూ కామెడీ కి ప్రేక్షకులు విరగబడి నవ్వుతున్నారు దాంతో ఈ వసూళ్లు సాధ్యమయ్యాయి .

సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట చిత్రంలో త్రిపాత్రాభినయం పోషించాడు . షకీలా కీలక  పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని సాయి రాజేష్ నిర్మించాడు . కొబ్బరిమట్ట ఓ మాదిరి వసూళ్లు సాధిస్తుందని అనుకున్నారు కానీ 3 రోజుల్లోనే 12 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం అంటే మాటలు కాదు మొత్తానికి కొబ్బరిమట్ట తో సంపూ మరోసారి తన సత్తా చాటాడు .