`A1 ఎక్స్‌ప్రెస్` ఫ‌స్ట్ లుక్: ‌విజ‌య గ‌ర్వంతో..

`A1 ఎక్స్‌ప్రెస్` ఫ‌స్ట్ లుక్: ‌విజ‌య గ‌ర్వంతో..
`A1 ఎక్స్‌ప్రెస్` ఫ‌స్ట్ లుక్: ‌విజ‌య గ‌ర్వంతో..

సందీప్ కిష‌న్  హీరోగా న‌టిస్తున్న చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్`. స్పోర్ట్స్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయిక‌గా న‌టిస్తోంది.
హాకీ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ బ్యాన‌ర్స్‌పై టీ.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, సందీప్‌కిష‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని చిత్ర బృందం శ‌నివారం విడుద‌ల చేసింది. `గేమ్ బిగిన్స్ ఇన్ థియేట‌ర్స్ అంటూ ఈ పోస్ట‌ర్‌కి క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో హీరో సందీప్ కిష‌న్ సిక్స్ ప్యాక్ యాబ్స్‌తో ష‌ర్ట్ విప్పేసి స్టేడియంలో ప్రేక్ష‌కుల హ‌ర్ష‌ధ్వానాల మ‌ధ్య విజ‌య‌గ‌ర్వంతో ఊగిపోతున్న స్టిల్ ఆక‌ట్టుకుంటోంది. హీరో సందీప్‌కిష‌న్ 25వ చిత్రంగా ఈ మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. చిత్రాన్ని త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లో రిలీజ్‌చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన `సింగిల్ కింగులం..` అంటూ సాగే పాట యూట్యూబ్‌లో సంద‌డి చేస్తోంది.