సందీప్ కిష‌న్‌కు కూడా షాకిచ్చింది!


సందీప్ కిష‌న్‌కు కూడా షాకిచ్చింది!
సందీప్ కిష‌న్‌కు కూడా షాకిచ్చింది!

క‌రోనా ఏమో గానీ ఈ మ‌ధ్య సామ‌న్యుడిని క‌రెంట్ బిల్ వ‌ణికిస్తోంది‌. లాక్‌డౌన్ స‌మ‌యం, క‌రోనా స్వైర విహారం చేస్తుండ‌టంతో ప్ర‌తీ నెలా బిల్ తీయాల్సిన స‌మ‌యంలో మూడు నెల‌ల పాటు బిల్ తీయ‌లేదు. దాంతో టారీఫ్‌లు పెరిగిపోయి క‌రెంట్ బిల్స్ గుదిబండ‌లుగా మారుతున్నాయి. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీల‌కు షాకిస్తున్నాయి.

ఇటీవ‌ల స్నేహ భ‌ర్త‌, త‌మిళ హీరో ప్ర‌స‌న్న త‌న ఇంటి క‌రెంట్ బిల్ గురించి సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో క‌రెంట్ బిల్లుల త‌తంగం వైర‌ల్‌గా మారింది. ఆ త‌రువాత కార్తీక‌, తాప్సీ, శ్ర‌ద్దా దాస్‌లు కూడా ఇదే స్థాయిలో క‌రెంట్ బిల్లుల‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం తెలిసిందే.

తాజాగా క‌రెంటు షాక్ సందీప్‌కిష‌న్‌కు త‌గిలింది. దీంతో అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశారు. `ఇంటి ద‌గ్గ‌ర క‌రెంటు మీట‌ర్ చూస్తుంటే చిన్న‌త‌నంలో ఆటో రిక్షా మీట‌ర్ గుర్తొస్తోంద‌ని, ఏంటీ సార్ ఈ బిల్లు అని ఆన్ లైన్‌లో వార్ మొద‌లైనా ఆశ్చ‌ర్యం లేద‌ని, తాజా క‌రెంటు బిల్లులు చూస్తుంటే సినిమా వీకెండ్ క‌లెక్ష‌న్‌ల‌లా వున్నాయ‌ని` సందీప్ కిష‌న్ ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.