సందీప్ కిషన్ కి  మళ్ళీ హిట్ గ్యారంటీ


Sandeep kishan’s new Movie Tenali Rama Krishna
Sandeep kishan’s new Movie Tenali Rama Krishna

నిను వీడని నీడను నేనే” అనే ఒక కొత్త రకమైన సినిమాతో ప్రేక్షకులను థ్రిల్ చేసిన సందీప్ కిషన్ ఈసారి “తెనాలి రామకృష్ణ B.A B.L అనే ఒక సరదా లాయర్ పాత్రలో మనల్ని అలరించడానికి వస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో కామెడీ తో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.  ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ సీక్వెన్స్ లో సందీప్ కిషన్ డూప్ లేకుండా  నటించి గాయాల పాలయ్యాడు.

దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి  రూపొందిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన హన్సిక కథానాయికగా నటిస్తోంది. రవితేజ “పవర్” సినిమా తర్వాత హన్సిక టాలీవుడ్ లో కనిపించడం  మళ్ళీ ఇప్పుడే. ఇక ఈ సినిమాలో  టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉండే పెద్ద ఆర్టిస్ట్ లు అందరూ ఉన్నారు.  వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాలో ప్రేక్షకులను విపరీతంగా అలరించిన సందీప్ కిషన్ – సప్తగిరి జోడి ఈ సినిమాలో అదే మ్యాజిక్ ను  రిపీట్ చేస్తామని అంటున్నారు. సన్నివేశం చెప్తే చాలు,  చాలా ఫాస్ట్ గా ట్యూన్ లు కంపోజ్ చేసే సాయికార్తీక్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు.

 జి.నాగేశ్వరరెడ్డి కి చాలా కాలంగా హిట్లు లేవు. 2016 లో వచ్చిన “ఈడో రకం ఆడో రకం”  సినిమా తర్వాత జి.నాగేశ్వరరెడ్డి చేసిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.  ఆయన తాజా చిత్రం మంచు విష్ణు తో చేసిన  “ఆచారి అమెరికా యాత్ర.”

తాజాగా ఇప్పుడు రిలీజ్ చేసిన తెనాలి రామకృష్ణ సినిమా ని కూడా కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. సినిమాలోని కొన్ని సన్నివేశాలు న్యాయవాదులను కించపరిచేలా ఉన్నాయంటూ,  కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేయగా, చిత్ర యూనిట్ వారి సందేహాలను క్లియర్ చేసింది. ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, మురళి శర్మ, రఘు బాబు, ప్రభాస్ శ్రీనుతో పాటు సీనియర్ నటి అన్నపూర్ణ కూడా నటిస్తున్నారు. తమిళ అగ్ర నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి ఇందులో విలన్ గా నటిస్తున్నారు.

 రొటీన్ సినిమాలు చేయకుండా సినిమా కథ విషయంలోనూ మరియు అన్ని రకాలుగా కొత్తదనం చూపించడానికి ప్రయత్నం చేస్తున్న హీరో సందీప్ కిషన్ కి ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుందాం.