సందీప్ కిష‌న్ సైలెంట్‌గా మొద‌లెట్టాడుగా!

సందీప్ కిష‌న్ సైలెంట్‌గా మొద‌లెట్టాడుగా!
సందీప్ కిష‌న్ సైలెంట్‌గా మొద‌లెట్టాడుగా!

క్రేజీ పాపుల‌ర్‌ హిట్ సాంగ్స్ లైన్స్‌ని తీసుకుని మూవీ టైటిల్స్‌గా పెట్టుకుంటున్న విష‌యం తెలిసిందే. అలా పాపుల‌ర్ హిట్ సాంగ్ చ‌ర‌ణాల్ని టైటిల్స్ గా మార్చుకున్న సినిమాల్లో చాలా వ‌ర‌కు సూప‌ర్ హిట్‌లుగా నిలిచాయి. అదే సెంటిమెంట్‌ని హీరో సందీప్ కిష‌న్ ఫాలో అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ధ‌నుష్‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం `మారి 2`. ఈ చిత్రంలో ప్ర‌భుదేవా కొరియోగ్ర‌ఫీ అందించిన `రౌడీ బేబీ` సాంగ్ టాక్ ద‌క్షిణాదిలో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచిన విష‌యం తెలిసిందే.

యూట్యూబ్‌లో ఈ పాట రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాట‌లోని `రౌడీ బేబీ` అనే చ‌ర‌ణాల‌ని టైటిల్‌గా మార్చుకుని సందీప్ కిష‌న్ ఓ మూవీ చేస్తున్నారు. కోన వెంక‌ట్ స‌మ‌ర్ప‌ణ‌లో జి. నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఎంవీవీ సినిమాస్ బ్యాన‌ర్‌పై ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తున్నారు. బుధ‌వారం ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ టైటిల్ పోస్ట‌ర్‌ని చిత్ర బృందం విడుద‌ల చేసింది.

బుధ‌వారం ఈ రెగ్యుల‌ర్ షూటింగ్ వైజాగ్‌లో ప్రారంభ‌మైంది. బాబీ సింహా, రాజేంద్ర‌ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం సందీప్‌కిష‌న్ `ఏ1 ఎక్స్‌ప్రెస్` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. లావ‌ణ్య త్రిపాఠి ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తోంది.