రూల్స్ పాటించని వాళ్ళని తిడుతున్న సందీప్ రెడ్డి వంగా

రూల్స్ పాటించని వాళ్ళని తిడుతున్న సందీప్ రెడ్డి వంగా
రూల్స్ పాటించని వాళ్ళని తిడుతున్న సందీప్ రెడ్డి వంగా

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలందరూ 21 రోజుల పాటు లాక్ డౌన్ పాటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ లాక్ డౌన్ లో భాగంగా అత్యవసర, వైద్య సేవలు మినహా అన్నిటిని బంద్ చేశారు. ప్రజలందరినీ కూడా గుంపులు గుంపులుగా రోడ్లమీద తిరగడాన్ని నిషేధించారు. కానీ ఇప్పటికీ కొంతమంది ఆకతాయిలు సరైన కారణం లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నారు. పోలీసులు ఆపి కొన్నిసార్లు అలాంటి వాళ్ళని కొడుతున్నా, కేసులు నమోదు చేస్తున్నా, ఫైన్ లు వేస్తూ,వారి చేత ట్రాఫిక్ డ్యూటీ చేయిస్తున్నా కూడా కొంతమంది పోకిరీలు ఇలాంటి వేషాలు వేయడం ఆపడం లేదు.

ఇక ఇలాంటి నిబంధనలు పాటించని వాళ్ళని, పోలీసులను పట్ల దురుసుగా ప్రవర్తించే వారిని, కరోనా వైరస్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను ఎగతాళి చేసే వారిని.. “అర్జున్ రెడ్డి” సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీవ్ర పదజాలంతో దూషించాడు. “ఈ దేశం కేవలం వాళ్ళకి మాత్రమే కాదు… మనది కూడా..! మన దేశాన్ని మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి.

మన భద్రత కోసం వాళ్లు తమ జీవితాలను త్యాగం చేసి, కుటుంబ సభ్యులతో గడపకుండా ఎంతో ఒత్తిడికి లోనవుతూ కూడా మనకి సేవలందిస్తున్నారు. వారిపట్ల కృతజ్ఞతా చూపించకపోగా, తిరిగి వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం క్షమించరాని తప్పు.!” అంటూ సందీప్ రెడ్డి అంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు సైతం కూడా మనలో మార్పు వచ్చి బాధ్యత గా ప్రవర్తించకపోతే మనుషులకు పశువులకు తేడా ఏముంటుంది.? దయచేసి నిబంధనలను అతిక్రమించి అల్లరిచిల్లరిగా రోడ్లమీద తిరిగే కొంతమంది ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోవాలి.