`డెవిల్‌` కోసం సందీప్ వంగ నిరీక్ష‌ణ‌!


`డెవిల్‌` కోసం సందీప్ వంగ నిరీక్ష‌ణ‌!
`డెవిల్‌` కోసం సందీప్ వంగ నిరీక్ష‌ణ‌!

కొన్ని ప్రాజెక్ట్‌లు ఎలా సెట్ట‌వుతాయో.. ఎప్పుడు మొద‌ల‌వుతాయో ఎవ్వ‌రికీ తెలియ‌దు. కానీ కొన్ని మాత్రం గిరిగీసి ప్లాన్ చేసుకున్నా అనుకున్న స‌మ‌యానికి సెట్స్‌పైకి రావు. ఆ స‌మ‌యం కోసం నిరీక్షించాల్సిందే. ఇప్పుడు ఇదే ప‌నిని `అర్జున్‌రెడ్డి ద‌ర్శ‌కుడు సందీప్ వంగ చేస్తున్నాడు. తెలుగులో `అర్జున్‌రెడ్డి` చిత్రంతో సంచ‌ల‌నం సృష్టించాడు. ఇదే చిత్రాన్ని బాలీవుడ్‌లో `క‌బీర్‌సింగ్‌` పేరుతో రీమేక్ చేయ‌గా అక్క‌డ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ద‌ర్శ‌కుడిగా సందీప్ వంగకు బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ని తీసుకొచ్చింది. 7 కోట్ల హీరోగా పేరున్న షాహీద్‌క‌పూర్ మార్కెట్‌నే స‌మూలంగా మార్చేసి 30 కోట్లు డిమాండ్ చేసేలా చేసింది.

ఇంత‌టి క్రేజ్‌ని సొంతం చేసుకున్న సందీప్ వంగ‌తో ప్ర‌భాస్ ఓ భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ని చేయాల‌ని ఫిక్స‌య్యాడు. మైత్రీ మూవీమేక‌ర్స్, టీ సిరీస్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించ‌డానికి గ్రీన్‌సిగ్న‌ల్ కూడా ఇచ్చేశాయి. అడ్వాన్స్ రూపంలో కొన్ని కోట్లు చేతుల కూడా మారాయి. ఈ చిత్రానికి `డెవిల్‌` అనే టైటిల్‌ని కూడా ఫైన‌ల్ చేశారు.  అయితే `సాహో` ఆశించిన ఫ‌లితాన్ని అందివ్వ‌ని కార‌ణంగా ప్ర‌భాస్ త‌న తాజా చిత్రం `జాన్‌`ని కొంత ఆల‌స్యంగా సెట్స్‌పైకి తీసుకొచ్చారు. క‌థ‌లో మార్పులు చేర్పులు చేయ‌డంతో `జాన్‌` చిత్రీక‌ర‌ణ ఆల‌స్య‌మైంది.

ఇదే సందీప్ వంగ `డెవిల్‌` చిత్ర ఆల‌స్యానికి ప్ర‌ధాన అడ్డంకిగా మారింది. `జాన్‌` షూటింగ్ పూర్తి చేసి కొంత విరామం తీసుకున్న త‌రువాతే `డెవిల్‌`ని ప్ర‌భాస్ మొద‌లుపెట్టాల‌నుకుంటున్నార‌ట‌. దీని ఎంత లేద‌నుకున్నా 5 నుంచి ఏడు నెల‌లు స‌మ‌యం ప‌డుతుంది. అంత వ‌రుకు ఓపిక‌గా సందీప్ వంగ నిరీక్షించాల్సిందే.