సందీప్‌రెడ్డి  వంగ `యానిమ‌ల్‌` సైకో థ్రిల్ల‌రా?

సందీప్‌రెడ్డి  వంగ `యానిమ‌ల్‌` సైకో థ్రిల్ల‌రా?
సందీప్‌రెడ్డి  వంగ `యానిమ‌ల్‌` సైకో థ్రిల్ల‌రా?

`అర్జున్‌రెడ్డి`తో రియ‌లిస్టిక్ అప్రోచ్.. మేకింగ్ ప‌రంగా, టేకింగ్ ప‌రంగా సంచల‌నం సృష్టించారు సందీప్‌రెడ్డి వంగ‌. తొలి సినిమాతో పాథ్ బ్రేకింగ్ మూవీని అందిందించి టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచారు. ఇదే చిత్రాన్ని హిందీలో `క‌బీర్‌సింగ్‌` పేరుతో రీమేక్ చేసి అక్క‌డా రికార్డులు సృష్టించారు. ఈ మూవీలో న‌టించిన షాహీద్ క‌పూర్ 7 కోట్లుగా వున్న రెమ్యున‌రేష‌న్ `క‌బీర్‌సింగ్‌`తో 30 కోట్లకు చేరింది.

ఈ మూవీ త‌రువాత సందీప్‌రెడ్డి వంగ ఎలాంటి సినిమాతో రాబోతున్నాడ‌న్న‌ది టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ చ‌ర్చ‌కు తెర‌దించుతూ న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా సందీప్ రెడ్డి వంగ శుక్ర‌వారం త‌న కొత్త చిత్రాన్ని ప్ర‌క‌టించారు. మూవీ అనౌన్స్‌మెంట్‌తో పాటు టైటిల్ లుక్ వీడియోని కూడా విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి ముందు నుంచి ప్ర‌చారంలో వున్న‌ట్టే `యానిమ‌ల్‌` టైటిల్‌ని ఫిక్స్ చేశారు. అనౌన్స్‌మెంట్ వీడియోలో న‌టీన‌టుల వివ‌రాల్ని కూడా వెల్ల‌డించారు.

హీరోయిన్‌గా ప‌రిణీతి చోప్రా, కీల‌క పాత్ర‌ల్లో అనిల్‌క‌పూర్‌, బాబీడియోల్ న‌టిస్తున్నారు. ఈ ప్రీలుక్ టీజ‌ర్‌ని ర‌ణ్‌బీర్ క‌పూర్ వాయిస్‌తో ప్రారంభించారు. త‌రువాత జీవితంలో త‌న తండ్రి త‌న‌కు కొడుకుగా పుట్టాల‌ని.. ఆ త‌రువాత జీవితంలో త‌న‌కు తండ్రిగా పుట్టాల‌ని హీరో చెబుతున్న వాయిస్‌.. ఆ త‌రువాత బుల్లెట్ల వ‌ర్షం కురుస్తున్న తీరు.. హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్ త‌న తండ్రి పాత్ర‌తో మాట్లాడుతున్న తీరు ఇదొక సైకో థ్రిల్ల‌ర్‌లా అనిపిస్తోంది.

పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఓ మృగం లాంటి త‌న‌యుడి క‌థ‌గా ఈ మూవీని చెబుతున్న‌ట్టు ప్రీలుక్ వీడియోని బ‌ట్టి తెలుస్తోంది. క‌థేంటి? .. హీరో తండ్రిని ఇలా అడ‌గ‌డానికి గ‌ల కార‌ణం ఏంటీ?.. ఆ త‌రువాత గుళ్ల వ‌ర్షం ఎవ‌రిపై కురుస్తోంది? అన్న‌ది తెలియాలంటే మ‌రి కొన్ని రోజులు వేచి చూడ‌క త‌ప్ప‌దు.