బాలీవుడ్ హీరో కోసం మహేష్ కు హ్యాండ్ ఇచ్చిన సందీప్ వంగ


Sandeep Vanga ditches Mahesh for Ranbir Kapoor
Sandeep Vanga ditches Mahesh for Ranbir Kapoor

సందీప్ రెడ్డి వంగ.. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో అదిరిపోయే హిట్ కొట్టాడు. ఈ దెబ్బకు సందీప్ పేరు నార్త్ అంతా మార్మోగిపోయింది. కబీర్ సింగ్ తర్వాత సందీప్ సినిమా ఎప్పుడు అంటూ బాలీవుడ్ మీడియా ఆరా తీయడం మొదలుపెట్టింది. అయితే సందీప్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ మహేష్ కు తాను ఒక లైన్ వినిపించానని, స్క్రిప్ట్ వర్క్ పూర్తైన తర్వాత అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలిపాడు.

తీరా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనుమానంగా మారింది. దానికి కారణం సందీప్ బాలీవుడ్ వైపు చూస్తుండడమే. మహేష్ తో చేయాల్సిన సినిమాను బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో ప్లాన్ చేస్తున్నాడట సందీప్. ఇదొక క్రైమ్ డ్రామా అని, ఆద్యంతం గ్రిప్పింగ్ గా సాగుతుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ మాత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. రణబీర్ సినిమాలు రెండు సెట్స్ పై ఉన్నాయి. అవి పూర్తయితే కానీ ఇది పట్టాలెక్కే అవకాశం లేదు.