సందీప్‌రెడ్డి వంగ స‌మ్మ‌ర్‌కి క్లాప్ కొట్టేస్తాడ‌ట‌!

సందీప్‌రెడ్డి వంగ స‌మ్మ‌ర్‌కి క్లాప్ కొట్టేస్తాడ‌ట‌!
సందీప్‌రెడ్డి వంగ స‌మ్మ‌ర్‌కి క్లాప్ కొట్టేస్తాడ‌ట‌!

సెన్సేష‌న‌ల్ ఫిల్మ్ `అర్జున్‌రెడ్డి`ని హిందీలో `క‌బీర్‌సింగ్` పేరుతో రీమేక్ చేస అక్క‌డా సంచ‌ల‌నం సృష్టించారు సందీప్‌రెడ్డి వంగ‌. ఈ మూవీ త‌రువాత బాలీవుడ్ హీరోతో భారీ చిత్రాన్ని తెర‌కెక్కించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న ఆయ‌న మొత్తానికి స‌క్సెస్ అయ్యారు. త్వ‌ర‌లో ర‌ణ్‌బీర్‌క‌పూర్‌తో ఓ భారీ చిత్రాన్ని చేయ‌బోతున్నారు. దీనికి సంబంధించిన ప్ర‌య‌త్నాలు ఊపందుకున్నాయి.

హిందీలో రూపొంద‌నున్న ఈ మూవీ తెలుగులోనూ విడుద‌ల కానుంది. దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌వ‌ర్క్ పూర్తి చేసిన సందీప్‌రెడ్డి వంగ ఇటీవ‌లే ర‌ణ్‌బీర్ క‌పూర్‌కు వినిపించార‌ట‌ స్టోరీ టెర్రిఫిక్‌గా వుండ‌టంతో ఫైన‌ల్ కాల్ ఇచ్చేశాడ‌ని తెలిసింది. టి సిరీస్ భూష‌ణ్ కుమార్‌, ముర‌ద్‌ఖేతాన్‌ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. ఈ చిత్రానికి ముందు `డెవిల్‌` అనే టైటిల్ అనుకున్నారు. కానీ తాజాగా ఆ స్థానంలో `యానిమ‌ల్‌` అని ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలిసింది.

ముందు ఈ స్టోరీని మ‌హేష్‌, ప్ర‌భాస్‌ల‌కు సందీప్ వినిపించార‌ట‌. అయితే ఈ జాన‌ర్‌, మేకింగ్ కూడా బోల్డ్‌గా వుండ‌టంతో దీన్ని మేము అటెమ్ట్ చేయ‌లేమ‌ని చెప్పేశార‌ట‌. ఇదే క‌థ‌ని ర‌ణ్‌బీర్ క‌పూర్ సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేసిన‌ట్టు తెలిసింది. అంతే కాకుండా ఇటీవ‌ల ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఈ మూవీ కంటెంట్ చాలా బోల్డ్‌గా వుంటుంద‌ని, షాకింగ్‌గా వుంటుంద‌ని చెప్ప‌డం ఈ ప్రాజెక్ట్‌పై అంచ‌నాల్ని పెంచేసింది. ఈ చిత్రానికి సందీప్ వంగ వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ లో క్లాప్ కొట్టించ‌బోతున్నారు. ఎప్పుడు రిలీజ్ వుంటుంది? న‌టీన‌టులు ఎవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.