సందీప్ రెడ్డి వంగాకు మ‌హేష్ గ్రీన్‌సిగ్న‌ల్‌?

 

Sandeep vanga, ready to direct Mahesh
Sandeep vanga, ready to direct Mahesh

సందీప్ రెడ్డి వంగా తెర‌కెక్కించిన తొలి సంచలనాత్మక చిత్రం ‘అర్జున్ రెడ్డి’. పాథ్ బ్రేకింగ్ చిత్రంగా టాలీవుడ్‌లో ఈ మూవీ పెను ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. ఒక్క సారిగా స్టార్ హీరోలు త‌మ‌ని తాము ప్ర‌శ్నించుకునేలా చేసింది. ఎటు వెళుతున్నా.. ఏం చేస్తున్నాం.. క‌మ‌ర్షియ‌ల్ ముసుగులో ఎలాంటి చిత్రాల్ని చేస్తున్నాం అని స్టార్ హీరోలు దీర్ఘాలోచ‌న‌లో ప‌డేసిందీ చిత్రం. ఈ మూవీని ప‌బ్లిక్‌గా మెచ్చుకున్న తొలి టాలీవుడ్ తారలలో మహేష్ బాబు ఒకరు.

సందీప్ స్క్రిప్ట్ కి, అత‌ని టేకింగ్‌కి మ‌హేష్ స్పెల్ బౌండ్ అయ్యారు. ఆ త‌రువాత సందీప్‌తో క‌లిసి సినిమా చేయ‌డానికి  మహేష్ ఆస‌క్తి చూపించాడు. చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి.  మహేష్ కు సందీప్ రెండు స్క్రిప్ట్లను వినిపించాడ‌ట‌. వాటిలో త్వరలో ప్రారంభమయ్యే బాలీవుడ్ చిత్రం `యానిమల్` ఒక‌టి. అయితే ఈ కథలు విన్న మ‌హేష్ ఇవి తన ఇమేజ్‌కి చాలా అవేగా ఉన్నాయని భావించి వాటిని తిరస్కరించాల్సి వచ్చింద‌ట‌.

ఇదిలా వుంటే  సందీప్ వంగా దర్శకత్వంలో మహేష్ నటించబోతున్నాడ‌ని తాజాగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇది చలనచిత్రం కాదు  సందీప్ ఒక ప్రముఖ బ్రాండ్ కోసం ఒక ప్రకటనని  మహేష్ తో చేయ‌బోతున్నాడు. ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ కోసం స‌ద‌రు కంప‌నీ వారు దీని చిత్రీక‌ర‌ణ కోసం  దర్శకుడిగా సందీప్ పేరును సూచించిస్తే మహేష్ వెంటనే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌.