ర‌ణ్‌బీర్ కపూర్ తో మిడ్‌నైట్ స‌ర్‌ప్రైజ్‌!

ర‌ణ్‌బీర్ కపూర్ తో మిడ్‌నైట్ స‌ర్‌ప్రైజ్‌!
ర‌ణ్‌బీర్ కపూర్ తో మిడ్‌నైట్ స‌ర్‌ప్రైజ్‌!

`అర్జున్‌రెడ్డి` వంటి సంచ‌ల‌న చిత్రంతో టాలీవుడ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేశారు సందీప్ రెడ్డి వంగ‌. ఈ మూవీతో స్టార్ హీరోల‌తో పాటు బాలీవుడ్ మేక‌ర్స్ దృష్టిని ఆక‌ర్షించారు. ఆ త‌రువాత ఇదే చిత్రాన్ని బాలీవుడ్ హీరో షాహీద్ క‌పూర్‌తో `క‌బీర్‌సింగ్‌` పేరుతో రీమేక్ చేసి అక్క‌డా హిస్ట‌రీ క్రియేట్ చేశారు. దీంతో ఆయ‌న‌తో సినిమాలు చేయాల‌ని బాలీవుడ్ స్టార్ హీరోలు క్యూ క‌ట్టారు.

ఈ నేప‌థ్యంలో సందీప్‌రెడ్డి వంగా క్రేజీ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో త‌న నెక్ట్స్ మూవీని చేయ‌బోతున్నారు. ఇండియన్ స్క్రీన్‌పై ఈ మూవీ స‌రికొత్త సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయం అని హీరో ర‌ణ్‌బీర్ కపూర్ ఇటీవ‌ల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై స‌ర్వ‌త్రా అంచ‌నాలు నెల‌కొన్నాయి. టి సిరీస్ బ్యాన‌ర్ పై భూష‌ణ్‌‌కుమార్, ముర‌ద్ ఖేతాన్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించ‌బోతున్నారు. ‌

బోల్డ్ కంటెంట్‌తో ప‌వ‌ర్‌ఫుల్ రియ‌లిస్టిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ మూవీ కోసం ఇప్ప‌టికే `యానిమ‌ల్‌` అనే టైటిల్ వైర‌ల్‌గా మారింది. ఈ మూవీ అప్ డేట్‌ని న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా గురువారం అర్థ్ర రాత్రి 12:01 నిమిషాల‌కి టి సిరీస్ యూట్యూబ్ చాన‌ల్‌లో ప్ర‌త్య‌క్షంగా ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగ ప్ర‌క‌టించ‌బోతున్నారు. ప‌రినీతి చోప్రా హీరోయిన్‌గా న‌టించ‌నున్న ఈ చిత్రంలో అనిల్ క‌పూర్‌, బాబీ డియోల్ కీలక పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట‌.