రెండ‌వ సారి తండ్రైన `అర్జున్‌రెడ్డి` ద‌ర్శ‌కుడు!


రెండ‌వ సారి తండ్రైన `అర్జున్‌రెడ్డి` ద‌ర్శ‌కుడు!
రెండ‌వ సారి తండ్రైన `అర్జున్‌రెడ్డి` ద‌ర్శ‌కుడు!

`అర్జున్‌రెడ్డి` సినిమాతో సంచ‌ల‌నం సృష్టించారు సందీప్‌రెడ్డి వంగ‌. తొలి సినిమాతో టాలీవుడ్‌లో వండ‌ర్స్ క్రియేట్ చేసిన ఆయ‌న గురువారం మ‌రోసారి తండ్రి అయ్యారు. ఆయ‌న భార్య‌కు గురువారం పాప పుట్టింది. ముందు సందీప్‌కు ఓ కొడుకు వున్నాడు. అత‌ని పేరు అర్జున్‌రెడ్డి. ఇప్పుడు రెండ‌వ సంతానంగా పాప పుట్ట‌డంతో చాలా సంతోషంగా వున్నార‌ట‌.

`అర్జున్‌రెడ్డి` చిత్రాన్ని హిందీలో `క‌బీర్‌సింగ్‌` పేరుతో షాహీద్ క‌పూర్ హీరోగా రీమేక్ చేసిన విష‌యం తెలిసిందే. సందీప్ వంగ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించి షాహీద్ క‌పూర్ కెరీర్‌నే మార్చేసింది. దేశ వ్యాప్తంగా అత్య‌ధిక వ‌సూళ్ల‌ని సాధించిన చిత్రంగా రికార్డు నెల‌కొలిపింది. షాహీద్ క‌పూర్ మార్కెట్‌ని 7 కోట్ల నుంచి 30కోట్ల‌కు మార్చేసింది.

ఈ సినిమా త‌రువాత ర‌ణ్‌బీర్ క‌పూర్ లేదా ర‌ణ్‌వీర్ సింగ్‌తో ఓ భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ని చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేశాడు. కానీ ఏదీ ఫ‌లించ‌లేదు. చివ‌రికి ప్ర‌భాస్‌తో `డెవిల్‌` చిత్రాన్ని చేయాల‌ని అంతా సిద్ధం చేసుకున్నారు. క‌థ కూడా వినిపించార‌ట కానీ ప్ర‌భాస్ `జాన్‌` త‌రువాత నాగ్ అశ్విన్‌కి ఛాన్స్ ఇచ్చిన ఇవ్వ‌డం సందీప్ వంగని షాక్ కు గురిచేసింద‌ని చెబుతున్నారు.