మళ్ళీ ఒక్క ఛాన్స్ అంటున్న సంగీత


Sangeetha wants one chance
Sangeetha wants one chance

ఒక్క ఛాన్స్ ……. ఒకే ఒక్క ఛాన్స్ నేనేంటో నిరూపించుకుంటా అంటూ ఖడ్గం చిత్రంలో నటించి అప్పట్లో సంచలనం సృష్టించిన భామ సంగీత . కట్ చేస్తే 17 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక్క ఛాన్స్ ఇవ్వండని అంటోంది ఈ భామ . 2002 లో విడుదలై సంచలన విజయం సాధించిన ఖడ్గం తో తెలుగు సినిమాల్లో బిజీ హీరోయిన్ అయ్యింది సంగీత . ఈ భామ పోషించిన క్యారెక్టర్ అప్పట్లో ఓ హీరోయిన్ ది అని ప్రచారం సాగిన విషయం తెలిసిందే .

కట్ చేస్తే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైన ఈ భామ ఇటీవల ఓ షోలో పాల్గొని మళ్ళీ సినిమాల్లో నటించాలనే ఆసక్తిని ప్రదర్శించింది . అయితే హీరోయిన్ కు పెళ్లయ్యాక అంతగా సినిమాలు రావు అందునా హీరోయిన్ పాత్రలు అస్సలు రావు అయినప్పటికీ ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ లు వస్తే చేస్తానని అంటోంది . ఇక తమిళంలో ఓ దర్శకుడు వచ్చి అక్రమ సంబంధాల నేపథ్యంలో ఓ సినిమా తీస్తానని వచ్చాడు , అందులో నన్ను నటించమని అడిగితే ఆగ్రహం వ్యక్తం చేసానని అంటోంది .