కరీనా కపూర్ తో సానియా మీర్జా బయోపిక్.?కరీనా కపూర్ తో సానియా మీర్జా బయోపిక్.?
కరీనా కపూర్ తో సానియా మీర్జా బయోపిక్.?

ఆటతో పాటుగా, అందంతో కూడా అభిమానులను అలరించిన టెన్నిస్ క్రీడాకారిణి “సానియా మీర్జా” జీవితం ఆధారంగా ఒక సినిమా వస్తోందా.? అవుననే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. మంచి కథగా మలిస్తే తన బయోపిక్ తీయడం ఓకే అని, సానియా మీర్జా ఇప్పటికే పలు ఇంటర్వ్యూ లలో చెప్పారు. ఇక బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్ ఈ సినిమాలో నటిస్తారనే వార్తఃలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. రీసెంట్ గా సానియా కుటుంబం మరియు ప్రముఖ క్రికెటర్ అజరుద్దీన్ గారి కుటుంబాలు బంధుత్వాలు కలుపుకున్నారు.

బాలీవుడ్ లో ఇప్పటికే అనేకమంది క్రీడాకారుల జీవితాల పై సినిమాలు వచ్చాయి. సూపర్ హిట్ అయ్యాయి. ప్రత్యేకించి మహిళా క్రీదకరినుల విషయానికి వస్తే ప్రియాంక చోప్రా చేసిన ప్రసిద్ద బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్ బయోపిక్ మహిళా అథ్లెట్ మిలన్ సింగ్ బయోపిక్ చిత్రాలు ఇప్పటికే మంచి హిట్ అయ్యాయి. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, విమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్స్ కూడా లైన్ లో ఉన్నాయి. ఇక సానియా జీవితానికి సంబంధించి ఆమె బాల్యం లో టెన్నిస్ ఆట నేర్చుకోడానికి ఆమె పడిన కష్టం, ఆమె కు టెన్నిస్ నేర్పించే క్రమంలో ఆమె కుటుంబం చేసిన త్యాగాలు, తన విజయాలు, వస్త్ర ధారణపై వచ్చిన విమర్శలు, ఒక ముస్లిం మహిళగా ఆమె ఎదుర్కొన్న వివక్షత, షోయబ్ తో ఆమె పెళ్లి ఇలా సినిమాటిక్ అంశాలు చాలా ఉన్నాయి. కనుక ఒక మంచి దర్శకుడు చేతిలో సానియా సబ్జెక్ట్ పడితే ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుంది.